Site icon HashtagU Telugu

Dalai Lama: బాలుడితో దలైలామా అసభ్య ప్రవర్తన.. ఆధ్యాత్మిక గురువుపై విమర్శలు!

Dalilama

Dalilama

బౌద్ధ మత గురువు దలైలామా వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ శాంతి సందేశాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఎంతోమంది భక్తులు ఆయన్ను కలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కూడా. తాజాగా ఓ భారతీయ కుర్రాడు దలైలామా ఆశీర్వాదం కోసం ఆయన దగ్గరకు వెళ్తాడు. ఆ బాలుడిని దగ్గరకు తీసుకొని ముద్దు పెడతాడు. అంతేకాదు.. ‘నీ నాలుకతో నా నాలుకను తాకుతావా’’ అంటూ ఆ బాలుడిపై ఒత్తిడి తేవడంతో అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన తీరుపై భక్తులు, నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం ఆధ్యాత్మిక బోధనలు చేసే దలైలామా ఇలా వ్యవహరిస్తారా? అంటూ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన వీడియో వైరల్ కావడంతో ఆయన్ను అరెస్ట్ చేయాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే దలైలామా ఈ ఘటనకు చింతిస్తూ వెంటనే క్షమాపణలు చెప్పాడు. “తాను కలుసుకునే వ్యక్తులను బహిరంగంగా, కెమెరాల ముందు కూడా టీజ్ చేస్తానని” అని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. “దలైలామా చేసిన ఈ పనికి పూర్తిగా షాక్ అయ్యాను. గతంలో కూడా తన సెక్సిస్ట్ అని వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. కానీ ఓ చిన్న కుర్రాడితో ‘ఇప్పుడు నా నాలుకను తాకుతావా’ అని చెప్పడం అసహ్యంగా ఉంది’’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

https://youtu.be/mBBtnrHipSc