అంగారక (మార్స్) గ్రహాన్ని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. అంతటి ప్రాధాన్యత కలిగిన అంగారకుడి రాశిచక్రం (Mars transit 2023) త్వరలో మారబోతోంది. ప్రస్తుతం మిథునరాశిలో ఉన్న అంగారకుడు మే 10న కర్కాటక రాశిలోకి (Mars transit 2023) ఎంటర్ కాబోతున్నాడు. ఆ తరువాత జూలై 1న సూర్యుని సొంత రాశి అయిన సింహరాశిలోకి వెళ్తాడు. అంగారకుడు ఈవిధంగా రాశులు మారడానికి జ్యోతిష్య శాస్త్రపరంగా చాలా ప్రాధాన్యత ఉంటుంది. అంగారకుడి మనిషికి జీవితంలో కష్టాన్ని, ధైర్యాన్ని అందిస్తాడు. ఆ గ్రహంలోని అగ్ని మూలకం వల్ల మనిషికి శక్తి, ధైర్యం వస్తాయి. భూమి, భవనం, మానవ సంబంధాలకు సంబంధించిన ప్రయోజనాలు చేకూరుతాయి. మే 10న మధ్యాహ్నం 01.44 గంటలకు కర్కాటక రాశిలోకి అంగారకుడి ఎంట్రీ కొన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. ఈ మార్పు ప్రభావం వల్ల ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.
1. మేషం
ఈ టైంలో మేష రాశిలోని నాలుగు స్థానంలో అంగారకుడు సంచరిస్తాడు. ఫలితంగా మీ ఆదాయం పెరుగుతుంది. మీరు ఎవరితోనూ వాగ్వాదాలకు దిగకుంటే ఈ ప్రయోజనం దక్కుతుంది. మీరు కొత్త వాహనం లేదా ఆస్తి కొనే అవకాశం ఉంది. ఇంటి వాతావరణం బాగుంటుంది. ఈ తాత్కాలిక స్థితిలో వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం బాగా గడిచిపోతుంది. మీరు ఆఫీసులో మంచి పనితీరు కనబరుస్తారు.
2. కన్య
కన్యారాశిలోని పదకొండో స్థానంలో మార్స్ సంచారం జరగబోతోంది. దాని ప్రభావంతో మీరు మునుపటి కంటే బలంగా, నమ్మకంగా ఉంటారు. మీరు మీ పనులన్నీ చాలా సమర్ధవంతంగా చేస్తారు. మీకు ఆఫిసులో పురోగతి ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఈ మార్పుతో ప్రయోజనాలను పొందబోతున్నారు. మీరు భూమి లేదా ఆస్తిని కొనడం, విక్రయించడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. ఖర్చులు పెరగడం వల్ల మీకు కొంత ఆర్థిక భారం పెరుగుతుంది.
ALSO READ : Starcrete on Mars: త్వరలో అంగారకుడిపై ఇల్లు? “స్టార్ క్రీట్” మెటీరియల్ రెడీ.. విశేషాలివీ..
3. కుంభం
కుంభ రాశిలోని ఆరో స్థానంలో అంగారకుడి సంచారం జరగబోతోంది. దీనివల్ల మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదలను చూస్తారు. ఒకటి కాదు అనేక మార్గాల ద్వారా మీకు డబ్బు వస్తుంది. దీంతో మీరు ఆర్థికంగా బలపడతారు. మీ ఆశయాలు నెరవేరడంతో పాటు చాలా సంతోషంగా ఉంటారు. చాలా కాలంగా ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి. అంగారకుడి ఈ సంచారము మీకు సంపదను సంపాదించడంలో, పోగుచేయడంలో సహాయపడుతుంది.
4. మీనం
మీన రాశిలోని ఐదో స్థానంలో కుజుడు సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. మీరు కార్యాలయంలో గొప్ప విజయాన్ని పొందుతారు. గౌరవం పెరుగుతుంది. పనిభారం పెరుగుతుంది. మీ హక్కులు, మీ అధికారాలు పెరుగుతాయి. ప్రమోషన్ పొందే అవకాశం కూడా కలుగుతుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసానికి దూరంగా ఉండాలి. చదువుకునే వాళ్లకు ఈ టైం సాధారణంగా ఉంటుంది. చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టాలి.