ఆరోగ్యం చిట్కాలు చెప్పే వారు అనారోగ్యం తో కన్నుమూయడం..పాములు పట్టే వాడు అదే పాము కాటుకు మరణించడం ఈ మధ్య చూస్తున్నాం. తాజాగా ఫిటినెస్ కు సంబందించిన నియమాలు చెపుతూ, అంతర్జాతీయ స్థాయిలో పేరు గుర్తింపు తెచ్చుకున్న బాడీ బిల్డర్ అదే జిమ్ లో మరణించడం ఇప్పుడు వార్తల్లో చర్చ గా మారింది. ఈ సంఘటన ఇండోనేషియాలోని బాలిలో జరిగింది.
ఇండోనేషియా(indonesia )లోని బాలి(Bali)లో 33 ఏళ్ల జస్టిన్ విక్కీ(Justyn Vicky).. 210కిలోల బరువు గల బార్బెల్ ఎత్తుతుండగా అదికాస్తా అతడి మెడపై పడడంతో ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జిమ్ లో ఏకంగా 210 కిలోల బరువు ఎత్తిన క్రమంలో దాన్ని మోయలేక అతను పడిన ఇబ్బంది వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. బరువును కంట్రోల్ చేయలేక దాన్ని అతి కష్టంమీద దించి వెనక్కి పడిపోయారు. అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్న బాడీ బిల్డర్, ఫిట్ నెస్ ప్రియులకు జాగ్రత్తలు చెప్పే ట్రైనర్, వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ మరణించడం ఇప్పుడు అంత మాట్లాడుకునేలా చేసింది.
https://twitter.com/KingVicOnYT/status/1682527524985683968?s=20
Read Also : 38 Girls Sick: మలేరియా నివారణ మాత్రలు మింగి 38 మంది విద్యార్థినులు అస్వస్థత