Letter Delivered After 100 Years: 100 ఏళ్ల తర్వాత డెలివరీ అయిన లెటర్

పూర్వకాలంలో వ్యక్తుల మధ్య సంబంధాలకు లేఖలు వారధిగా ఉండేవి. అప్పట్లో టెలిఫోన్ (Telephone) సౌకర్యం చాలా ప్రాంతాలకు ఉండేది కాదు.

పూర్వకాలంలో వ్యక్తుల మధ్య సంబంధాలకు లేఖలు (Letter) వారధిగా ఉండేవి. అప్పట్లో టెలిఫోన్ సౌకర్యం చాలా ప్రాంతాలకు ఉండేది కాదు. అందుకే ఏ సంప్రదింపులు అయినా లేఖల రూపంలో ఉండేవి. లండన్ లో ఓ లేఖ పోస్ట్ చేసిన 100 ఏళ్ల తర్వాత ఇటీవలే డెలివరీ అయింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 1916లో ఈ లేఖను క్రిస్టాబెల్ మెన్నెల్ అనే యువతి తన ఫ్రెండ్ అయిన కేటీ మార్ష్ కు పోస్ట్ చేశారు.

వందేళ్ల తర్వాత 2021లో ఈ లేఖ లండన్ లోని ఓ ఫ్లాట్ వద్ద లెటర్ బాక్స్ (Letter Box) లో తేలింది. రాయల్ మెయిల్ సిబ్బంది వందేళ్ల తర్వాత జాగ్రత్తగా డెలివరీ చేసింది. నిజానికి ఈ లేఖను అందుకోవాల్సిన వ్యక్తి భూమిపై లేరు. సంబంధిత ఫ్లాట్ లో ఉండే గ్లెన్ (27) అనే వ్యక్తి ఈ లేఖను చూసి ఆశ్చర్యపోయారు. ఏడాది పాటు ఈ లేఖను అలా చూసిన తర్వాత చివరికి హిస్టారికల్ సొసైటీకి అందించారు. ఇంత కాలం పాటు ఎందుకు డెలివరీ చేయలేదనే దానికి రాయల్ మెయిల్ నుంచి ఎలాంటి సమాధానం లేదు.

Also Read:  What Is Shivatatvam Telling Us: మనకు శివతత్వం ఏం చెబుతోంది!