Yadadri Temple: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్లాస్టిక్(Plastic)పై నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ నిషధం అమలులో ఉంటుందని ఈవో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ కవర్లు మొదలు వాటి స్థానముల్లో ప్రత్యామ్నాయంగా ప్లాస్టికేతర వస్తువులు మాత్రమే వాడాలని పేర్కొంది. ఈ నిషేధాన్ని అందరూ విధిగా పాటించాలని ఆదేశించింది. దేవస్థానంలోని అన్ని విభాగాల్లో ప్లాస్టిక్ వినియోగం జరగకుండా తప్పనిసరిగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత విభాగముల అధికారులను, సిబ్బందిని ఈవో ఆదేశించారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఇప్పటికే యాదాద్రి ప్రధానాలయంలోకి సెల్ఫోన్లను నిషేధిస్తూ ఆలయ ఈవో భాస్కర్‌రావు ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిబంధనను సాధారణ భక్తులతోపాటు వీవీఐపీలు మెుదలుకొని.. అధికారులు, సిబ్బంది, అర్చకులు, పోలీసులు, మీడియా, అవుట్ సోర్సింగ్ సిబ్బందికీ నిబంధన వర్తించనుంది. ఎవరైనా ప్రధాన ఆలయంలోకి సెల్‌ఫోన్ తీసుకెళ్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఆలయ సిబ్బందికి సహకరించాలని కోరారు.
Read Also: Bibhav Kumar Arrest : స్వాతి మలివాల్‌పై దాడి.. కేజ్రీవాల్ మాజీ పీఎస్ బిభవ్ అరెస్ట్
మరోవైపు యాదాద్రి పుణ్యక్షేత్రంలో రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరుగుతుంది. గత గత ప్రభుత్వం యాదాద్రి లక్ష్మీనరసింహుడి ఆలయాన్ని పునర్నిర్మించగా.. అప్పట్నుంచి రోజూ వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి తర్వాత అత్యధికంగా భక్తులు దర్శించే పుణ్యక్షేత్రం యాదాద్రి. ఈ మేరకు ఆలయ అధికారులు కూడా భక్తుల సౌకర్యార్థం అనేక ఏర్పాట్లు చేస్తున్నారు.