Site icon HashtagU Telugu

Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్‌కు చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్లు

Threatening phone calls to MLA Raja Singh

Threatening phone calls to MLA Raja Singh

Death Threats: గోషామహల్‌ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్(Raja Singh) తనకు బెదిరింపు కాల్స్‌(Threatening calls) వస్తున్నాయని అన్నారు. ఈరోజు తనకు వివిధ ఫోన్‌ నెంబర్ల నుండి బెదిరింపు కాల్స్‌ వచ్చియని..తనను చంపుతానంటూ బెదిరింస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. అయితే తనకు ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

గతంలోనూ ఈ బెదిరింపుల(threats)పై తాను ఫిర్యాదు చేశానని..కానీ పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తనకు వచ్చిన బెదిరింపులపై పోలీసులకు తెలియజేయడం బాధ్యతగా భావిస్తున్నానన్నారు.

Read Also: Delhi Water Crisis: నీటిని వృథా చేస్తే రూ.2,000 జరిమానా, ప్రభుత్వ ఉత్తర్వులు

కాగా, తనకు వచ్చిన బెదిరింపులకు సంబంధించిన ఫోన్ నెంబర్లను రాజాసింగ్ ట్వీట్‌లో వెల్లడించారు. ప్రధాని మోడీ, పీఎంవో ఇండియా, అమిత్ షా, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సిటీ పోలీస్, తెలంగాణ సీఎంవోలను ఆయన ట్యాగ్ చేశారు.