Bumber Offer: ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేసేవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వారికి ఒక ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ అభివృద్దిపై ప్రజలను ఆకట్టుకునేలా రీల్స్, షార్ట్ చేసినవారికి రూ.లక్ష బహుమతిగా ఇవ్వనుంది. ఈ విషయాన్ని తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇందుకోసం హైదరాబాద్ విశిష్టత, డెవలప్ మెంట్ పై ఆసక్తికరంగా ఉండేలా 60 సెకన్ల వీడియో చేయాలని సూచించింది.
ఈ వీడియోకు @digitalmediats అనే ట్యాగ్ ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. అలాగే DIR_DM@TELANGANA.GOV.INకి కూడా వీడియోను మెయిల్ చేయవచ్చని స్పష్టం చేసింది. ఏప్రిల్ 30 వరకు ఆసక్తికరవారికి అవకాశం కల్పించింది. ఈ నెల చివరికల్లా వీడియోను పంపించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం IT.TELANGANA.GOV.IN/CONTEST/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చని తెలిపింది. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్ బాగా పాపులర్ అయ్యాయి. నెటిజన్లు వీటిని ఆసక్తిగా చూస్తున్నారు. అంతేకాకుండా ఇవి సోషల్ మీడియలో ట్రెండింగ్ గా మారాయి.
ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లోని వీడియోలు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్నాయి. దీంతో హైదరాబాద్ అభివృద్ధిని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ కాంటెస్ట్ ను ప్రారంభించింది. ఏకంగా రూ.లక్ష బహుమతి ప్రకటించిందంటే మాములు విషయం కాదు. చాలామంది యువత ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, యూట్యూబ్ లో షార్ట్ చేస్తూ పాపులర్ అవుతున్నారు. అలాంటి వారికి ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు. అలాగే రీల్స్, షార్ట్ ను చాలామంది చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇవి ఎక్కువ నిడివి ఉండదు. దీంతో సింపుల్ గా ఉండటంతో చాలామంది చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ ప్రపంచ నగరంగా మారిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి జీవిస్తున్నారు.