Site icon HashtagU Telugu

BRS : కంటోన్మెంట్‌ ఉపఎన్నికపై బీఆర్‌ఎస్ నజర్‌.. అభ్యర్థిగా నివేదిత..

Niveditha

Niveditha

తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో లాస్య నందిత (Lasya Nanditha) గెలుపొందింది. అయితే.. ఆమె ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే.. దేశవ్యాప్తంగా లోక్‌ సభ ఎన్నికలకు సమయం ఆసన్నమవడంతో.. తెలంగాణలో లోక్‌ సభకు పోలింగ్‌ జరుగనున్న మే 13వ తేదీనే సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పొలింగ్‌కు షెడ్యూల్‌ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే.. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరుఫున బరిలో నిలచి గెలిచిన లాస్య నందిత మృతితో ఖాళీ అయిన కంటోన్మెంట్‌ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. ఈ స్థానం నుంచి లాస్య నందిత సోదరి నివేదితను అభ్యర్థిగా గులాబీ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే నేడు బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు (Kalvyakuntla Chandrashekar Rao) కంటోన్మెంట్‌ ఉపఎన్నికపై బీఆర్‌ఎస్ దృష్టి సారించి.. కంటోన్మెంట్ నియోజకవర్గం ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. కంటోన్మెంట్ ఉపఎన్నిక, అభ్యర్థిపై చర్చ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి.. హాజరైన దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం నివేదిత (Niveditha)ను బీఆర్‌ఎస్‌ తరుఫున అభ్యర్థిగా ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటే.. గత ఎన్నికల ముందు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ 2023 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమించింది. కానీ.. ఫలితాలు తారుమారుకావడంతో బీఆర్‌ఎస్‌ నుంచి భారీ ఇతర పార్టీలకు.. ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి నాయకులు వెళ్తుండటం ఆ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అంతేకాకుండా.. ఇప్పటికే దాదాపు 20కి పైగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్‌ నేతలు మీడియా ముందు బాహాటంగా చెప్పుకొస్తున్నారు. ఇదే జరిగితే బీఆర్‌ఎస్‌లో ఖాళీ అవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థిగా నారాయణ్ శ్రీ గణేష్‌ను కాంగ్రెస్ ప్రకటించింది. నారాయణ్ శ్రీ గణేష్ (Narayan Sri Ganesh) ఇటీవలే బీజేపీ (BJP) నుంచి కాంగ్రెస్ (Congress) పార్టీలోకి మారారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రెండో స్థానంలో నిలిచారు.

ఏప్రిల్‌ 18న కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి నోటిఫికేషన్‌ విడుదల కానున్నది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. మే 13న పోలింగ్‌ నిర్వహించి జూన్‌ 4న ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. కాగా, కంటోన్మెంట్‌తో పాటు పలు రాష్ర్టాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల అధికారులు తెలిపారు.

Read Also : BRS to TRS : మళ్లీ టీఆర్‌ఎస్‌గా పేరు మార్పు.. ఈ నెల 27న..?