Rain Alert : నాలుగు రోజులు వానలు..50 కి.మీ వేగంతో ఈదురుగాలులు

తెలంగాణలోని పలు జిల్లాల్లో నాలుగు రోజుల పాటు ఎల్లో అలర్ట్ (Rain Alert) ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - May 21, 2023 / 10:30 AM IST

తెలంగాణలోని పలు జిల్లాల్లో నాలుగు రోజుల పాటు ఎల్లో అలర్ట్ (Rain Alert) ప్రకటించారు. ఆ జిల్లాలో గంటకు  50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు మోస్తరు వానలు(Rain Alert) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇవాళ కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగా రెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నారాయణ, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.

మే 22న.. 

రేపు (మే 22న) జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, హైదరాబాద్, యాదాద్రి భువనపల్లి, హైదరాబాద్‌లోని మల్కాజిగిరి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని చెప్పారు.

also read : Dangerous Heat: భవిష్యత్తులో 3 రెట్లు పెరగనున్న వాతావరణంలో వేడి

మే 23న.. 

ఎల్లుండి (మే 23న) నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాపలల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల్, నారాయణపేట్, హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజిగిరి, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

మే 24న..

మే 24న రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లొండ, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.