PM MODI: లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections) ప్రచారాన్ని హోరెత్తించేందుకు రాష్ట్ర నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలు కూడా సిద్దం అయ్యారు. ఇందులో భాగంగానే ప్రధాని మో(PM Modi)తెలంగాణ (Telangana)లో పర్యటించనున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ నెల 30వ తేదీన మోడీ రాష్ట్రానికి రానున్నారు. పర్యటనలో భాగంగా ఆందోల్ నియోజకవర్గానికి వెళ్లనున్న మోడీ అక్కడ బీజేపీ ( BJP)ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు హాజరు కానున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అనంతరం వచ్చే నెల 3, 4 తేదీల్లోనూ ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నారాయణపేట్, చేవెళ్ల నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలకు మోడీ హాజరవుతారు. అయితే రానున్న లోక్ సభ ఎన్నికల( Lok Sabha elections) నేపథ్యంలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని కమలదళం భావిస్తున్న సంగతి తెలిసిందే.
Read Also:Harish Rao: ఎమ్మెల్యే పదవికి హరీష్ రావు రాజీనామా..? మళ్లీ పోటీ చేయనంటూ శపధం
మరోవైపు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో జోష్ చూపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై వరుస విమర్శలు చేస్తున్నారు. తాజాగా మరోసారి రాజస్థాన్ లో పర్యటించిన ఆయన టోంక్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగానే ఉండేదన్నారు. ప్రజల ఆస్తులను లాక్కుని కొందరు ప్రత్యేక వ్యక్తులకు పంచేందుకు ప్రయత్నిస్తోందన్న వాస్తవాన్ని బయటపెడితే, కాంగ్రెస్ ఎందుకు ఉలిక్కిపడుతోందని మోడీ నిలదీశారు.