Site icon HashtagU Telugu

Tet-Exam : తెలంగాణ టెట్ పరీక్ష కేంద్రంలో విషాదం..నిండు గర్భిణీ మృతి

Pregnant Woman Dies

Pregnant Woman Dies

టెట్ పరీక్ష కేంద్రంలో విషాదం చోటుచేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా (Sangareddy) పటాన్ చెరు మండలం ఇస్నాపురంలో చోటుచేసుకుంది. తెలంగాణ టెట్ పరీక్షా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు సెంటర్లలో జరుగుతుంది. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు. పేపర్‌-1 పరీక్షకు 1,139 కేంద్రాలను, పేపర్‌-2కు 913 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్‌-1కు 2,69,557 మంది, పేపర్‌-2కు 2,08,498 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 4.78 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు.

ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపురంలో టెట్ పరీక్షా (TET Exam ) రాసేందుకు 8 నెలల గర్భిణీ (Pregnant Woman Radhika) రాధికా హాజరైంది. పరీక్షా సమయం దగ్గరి పడుతుండడం తో ఆమె పరీక్షా సెంటర్ కు పరిగెత్తుకుంటూ రావడం తో ఆమె బీపీ పెరిగిపోయింది. ఎగ్జామ్ హాల్ (TET Exam Hall) కు చేరుకున్న కాసేపటికే కళ్లు తిరిగి పడిపోయింది. ఇన్విజిలేటర్ గమనించి అధికారులకు సమాచారం ఇవ్వగా.. కేంద్రం బయట వెయిట్ చేస్తున్న రాధిక భర్త అరుణ్ అక్కడికి చేరుకున్నాడు. సిబ్బంది సాయంతో రాధికను పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే రాధిక చనిపోయిందని వైద్యులు నిర్ధారించడంతో భర్త కన్నీటిపర్యంతమయ్యాడు. రాత్రింబవళ్లు చదివి, పరీక్ష రాయడానికి వస్తే ప్రాణాలే పోయాయని బోరున విలపించాడు. ఈ ఘటన తో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

Read Also : AP : పొత్తు ఫిక్స్ కాగానే సైలెంట్ అయినా బిజెపి చీఫ్ పురందేశ్వరి ..