Pm Modi – Ntr : ఎన్టీఆర్ పై మోడీ “మన్ కీ బాత్”.. ఏమన్నారంటే

ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ  ‘101వ మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లో నందమూరి తారక రామారావు (Pm Modi - Ntr) గురించి ప్రస్తావించారు.

  • Written By:
  • Publish Date - May 28, 2023 / 02:27 PM IST

ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ  ‘101వ మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లో నందమూరి తారక రామారావు (Pm Modi – Ntr) గురించి ప్రస్తావించారు. శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. కోట్లాది ప్రజల మనసుల్లో స్థానం సంపాదించిన వ్యక్తి ఎన్టీఆర్(Pm Modi – Ntr) అని కొనియాడారు. రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఎన్టీఆర్ చేసిన నటనను ఇప్పటికీ జనం గుర్తు చేసుకుంటారని మోడీ  అన్నారు.  ఎన్టీఆర్ సినీరంగంతో పాటు రాజకీయాల్లోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. నందమూరి తారక రామారావు శకపురుషుడు, హృదయాలను ఏలిన మహనీయుడు అని కితాబిచ్చారు. ఈరోజు  వీర సావర్కర్‌ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళి అర్పించారు. సావర్కర్‌ను ఖైదు చేసిన అండమాన్‌లోని కాలాపానీ జైలును సందర్శించిన రోజును తాను మర్చిపోలేనని చెప్పారు. నిర్భయంగా, ఆత్మగౌరవంగా వ్యవహరించే సావర్కర్‌ శైలి బానిసత్వాన్ని ఎన్నటికీ అంగీకరించదని పేర్కొన్నారు. కేవలం స్వాతంత్ర్య పోరాటమే కాదు.. సమానత్వం, సామాజిక న్యాయం కోసం సావర్కర్‌ చేసిన కృషిని ఇప్పటికీ జనం గుర్తుచేసుకొంటున్నారన్నారు.

Also read  : Modi Graph : 9ఏళ్ల‌లో లేచిప‌డిన‌ మోడీ గ్రాఫ్

వందేళ్ల వృద్దురాలు తన ఫొటోను..

దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం వచ్చే 25 ఏళ్లు చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ వినేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిని చూపిన విషయాన్ని ప్రధాని మోడీ గుర్తు చేశారు. న్యూజిలాండ్ లో వందేళ్ల వృద్దురాలు తన ఫొటోను ఆశీర్వదించారని గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా ప్రజల నుండి నిర్మాణాత్మక సూచనలు, సలహలు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా వచ్చిన విషయాన్ని ప్రధాని వివరించారు. ఏక్‌భారత్‌, శ్రేష్ఠ్‌ భారత్‌ స్ఫూర్తితో ప్రారంభంచిన ‘యువ సంగం’ కార్యక్రమంలో పాల్గొన్న అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన గ్యామర్‌ న్యోకుమ్‌, బిహార్‌కు చెందిన విశాఖ సింగ్‌ అనే విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు. వారి పర్యటన అనుభవాలను తెలుసుకొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మ్యూజియాల సమాచారాన్ని ఒక్క చోటకు చేర్చి అందుబాటులోకి తెచ్చామని ప్రధాని మోదీ తెలిపారు. గురుగ్రామ్‌లోని ఓ మ్యూజియంలో 8,000 రకాల కెమెరాలు ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.