హైదరాబాద్ (Hyderabad)నగరంలో మంగళవారం అర్ధరాత్రి తుపాకీతో కాల్పుల కలకలం (Gun Firing) రేగింది. హైదరాబాద్‌లోని టప్పాచబుత్రాలో ఓ యువకుడిని టార్గెట్ చేసుకుని పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గన్ ఫైరింగ్ జరిగింది. ఆకాష్ సింగ్ (26) అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆకాశ్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న డీసీపీ కిరణ్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
Also Read: 7 Tourists Dead: సిక్కింలో ఘోర ప్రమాదం.. భారీ హిమపాతంతో 7 టూరిస్టులు దుర్మరణం!
పాత కక్షల కారణంగానే కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు బీజేపీ నేత అమర్ సింగ్ అల్లుడు అనే ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.