Site icon HashtagU Telugu

Mukarram Jah: నిజాం కుటుంబంలో విషాదం.. ఎనిమిదో నిజాం మృతి

Mukarram Jah

Resizeimagesize (1280 X 720) 11zon (1)

హైద‌రాబాద్ ఎనిమిదో నిజాం నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ వాలాషన్ ముకర్రం జా (Mukarram Jah) బహదూర్ భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10:30 గంటలకు కన్నుమూశారు. నిజాం టర్కీలోని ఇస్తాంబుల్‌లో తుది శ్వాస విడిచాడు. నిజాం స్వదేశంలో విశ్రాంతి తీసుకోవాలన్నది నిజాం చివరి కోరిక కాబట్టి ఆయన పిల్లలు జనవరి 17న దివంగత నిజాం మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. మృతదేహాన్ని చౌమహల్లా ప్యాలెస్‌కు తీసుకెళ్లి అంత్యక్రియల అనంతరం అసఫ్ జాహీ కుటుంబ సమాధి వద్ద ఖననం చేస్తారు. షెడ్యూల్‌, ఇతర వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Also Read: Nepal Aircraft Crash: నేపాల్‌లో కుప్పకూలిన విమానం

7వ నిజాం న‌వాబు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1954లో త‌న వార‌సుడిని ముకర్రం జాని ప్ర‌క‌టించారు. 1954 నుంచి ముకర్రం జా 8వ న‌వాబుగా ఖ్యాతి గాంచారు. 1971 వ‌ర‌కు ప్రిన్స్ ఆఫ్ హైద‌రాబాద్ అని పిల‌వ‌బ‌డుతూ వ‌చ్చారు. 1971లో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల రాజ్యాలు, ప‌ద‌వులు, బిరుదులు ర‌ద్ద‌య్యాయి. ముకర్రం జా అస‌లు పేరు బ‌ర్క‌త్ అలీ ఖాన్. చాలా ఏళ్లుగా ట‌ర్కీలోని ఇస్తాంబుల్ లో నివాసం ఉంటున్నారు. ముకర్రం జా ఐదుగురిని వివాహం చేసుకున్నారు. వారిలో ముగ్గురు ట‌ర్కీకి చెందిన వారే కావ‌డం విశేషం. మొద‌టి భార్య ఎస్రా బిర్గిన్ తో ఒక కొడుకు, ఒక కుమార్తెని కన్నారు.