Site icon HashtagU Telugu

MLC Elections in AP & Telangana : తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభ‌మైన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్‌

Maharashtra Election Result

Maharashtra Election Result

తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పోలింగ్ ప్రారంభ‌మైంది. సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఆంధ్రప్రదేశ్‌లో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ రోజు (సోమవారం) పోలింగ్ ప‌క్రియ ప్రారంభ‌మైంది. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవాలని అధికార పక్షం ఉవ్విళ్లూరుతుండగా.. ఆ స్థానాలను దక్కించుకునేందుకు విపక్షాలు జోరుగా ప్రచారం సాగించాయి. తూర్పు రాయలసీమ నియోజకవర్గానికి సంబంధించి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పట్టభద్రుల నియోజకవర్గం, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు.. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గానికి సంబంధించి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పట్టభద్రుల నియోజకవర్గాలు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు ఎన్నికలు జ‌రుగుతున్నాయి. ఉత్తర కోస్తాంధ్రలోని విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జ‌రుగుతున్నాయి.

ఉదయం 8 గంటలకు ప్రారంభ‌మైన పోలింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. మరోవైపు, తెలంగాణలో హైదరాబాద్-రంగా రెడ్డి-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి 1 ఉపాధ్యాయుడు, 1 ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జ‌రుగుతున్నాయి. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానానికి హైదరాబాద్‌ జిల్లాలో మొత్తం 139 పోలింగ్‌ కేంద్రాలతో పాటు 25 బూత్‌లు, రంగారెడ్డి జిల్లాలో 31 పోలింగ్‌ కేంద్రాలు, 14 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉందని తెలిపారు.