Site icon HashtagU Telugu

Khammam: బీఆర్ఎస్‌కు మ‌రో బిగ్ షాక్ త‌గ‌ల‌నుందా..? బీజేపీలోకి నామా నాగేశ్వరరావు..?

Khammam

Nama Bjp Tdp

BRS పార్టీ ప్ర‌స్తుతం కాస్త ఇబ్బందులు ప‌డుతుంది. గ‌తేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి పలువురు ప్రముఖ నేతలు పార్టీని వీడారు. లో క్‌సభ ఎన్నికలకు ముందు ఈ ధోరణి మ‌రింత పెరిగింది. అనేక మంది సిట్టింగ్ BRS ఎంపీలు BJP లేదా కాంగ్రెస్‌లోకి మారడం, ఎన్నికలలో పార్టీ అవకాశాలను గణనీయంగా ప్రభావితం చేసింది. అయితే తాజాగా ఖమ్మం (Khammam) ఎంపీ నామా నాగేశ్వరరావు బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ వచ్చినప్పటికీ బీజేపీలోకి మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. నామా బీజేపీలోకి వెళ్లే స‌మ‌యం ఆసన్నమైందని, మరో రెండు మూడు రోజుల్లో అది జరగవచ్చని రాజ‌కీయ నిపుణులు భావిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఆయన బీజేపీలో చేరనున్నట్లు సమాచారం వ‌స్తోంది. ఆయన నిష్క్రమణ లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌కు పెద్ద దెబ్బే అని చెప్ప‌వ‌చ్చు. నామా నిష్క్రమణ తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ కొత్త అభ్యర్థిని కూడా ప్రకటించాల్సి ఉంటుంది.

Also Read: Maha Rally : 31న ఇండియా కూటమి ‘మహా ర్యాలీ’.. ఎక్కడో తెలుసా ?

అయితే నామాతో బీజేపీ అధిష్టానం చర్చలు జ‌రిపిన‌ట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. బీఆర్ఎస్సా, బీజేపీనా గత కొన్నాళ్ళ నుంచి సస్పెన్స్ గా నామా ఎపిసోడ్ మారింది. అయితే ఖ‌మ్మం పార్ల‌మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పటికే నామా పేరును కేసీఆర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌ల ఖమ్మం టికెట్ ఆశించి బీజేపీ తీర్థం పుచ్చుకున్న జలగం వెంకటరావు. టికెట్ నాకే వస్తుందన్న భావ‌న‌లో జలగం ఉన్నారు. జలగంకి షాక్ ఇచ్చి నామాకి టికెట్ ఇచ్చే ఆలోచనలో బీజేపీ ఉంది. ఇప్పటికే 15 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్ర‌క‌టించింది. బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన అన్ని చోట్ల అసంతృప్త నేతలు రెబల్ గా మారుతున్నారు.

We’re now on WhatsApp : Click to Join