KCR Family: లోక్‌సభ ఎన్నికలకు(Lok Sabha elections) కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసుకున్నాయి. ఇక తెలంగాణలో బీఆర్ఎస్(brs) కూడా పూర్తి అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించింది. అయితే.. కేసీఆర్ కుటుంబం(KCR Family) నుంచి ప్రతిసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎవరో ఒకరు బరిలో ఉండేవారు. కాని.. ఈసారి మాత్రం పోటీలో కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఒక్కరు కూడా పోటీలో లేరు. 2004 నుంచి లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం పోటీ చేస్తుంది. కానీ.. తొలిసారి 2024 లోక్‌సభ ఎన్నికలకు వారు దూరంగా ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా.. తెలంగాణ రాష్ట్ర సమితిని రాష్ట్ర సాధన కోసం 2001లో కేసీఆర్ స్థాపించారు. ఆ తర్వాత వచ్చిన 2004 ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ నుంచి పోటీ చేసి కేసీఆర్ గెలిచారు. అప్పుడే కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలో ఆయన కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2006, 2008 ఉపఎన్నికల్లో కూడా బరిలో నిలిచి విజయాన్ని అందుకున్నారు. 2009లో సార్వత్రిక ఎన్నికలు జరగ్గా మహబూబ్‌నగర్ లోక్‌సభ నుంచి కేసీఆర్ బరిలో నిలిచి మళ్లీ గెలిచారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయ్యింది. 2014లో టీఆర్ఎస్ తెలంగాణలో గవర్నమెంట్‌ను ఏర్పాటు చేసింది. కేసీఆర్ సీఎంగా కొనసాగారు. జమిలిగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవిత పోటీ చేసి నిజామాబాద్ ఎంపీగా గెలిచారు.
Read Also: Trump: ప్రపంచ కుబేరుల జాబితాలో ట్రంప్‌నకు స్థానం
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన పరిస్థితుల్లో కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్ రావు లోక్‌సభకు పోటీ చేస్తారన్న ప్రచారం జరిగినా వారెవరూ సార్వత్రిక ఎన్నికల బరిలో దిగడం లేదు. నిజామాబాద్ నుంచి గతంలో ఒకసారి గెలుపొంది, మరోమారు ఓటమిపాలైన కవిత ఈసారి పోటీ చేయడం లేదు. సుదీర్ఘ కాలం తర్వాత కేసీఆర్ కుటుంబసభ్యులు లోక్‌సభ ఎన్నికల పోటీకి దూరంగా ఉండడం ఇదే తొలిసారి.
Read Also: Delhi Metro: ఢిల్లీలో హై అలర్ట్.. మూడు మెట్రో స్టేషన్లను మూసివేత
1983లో తొలిసారి శాసనభకు పోటీ చేసి కేసీఆర్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వరుసగా శాసనసభకు ఎన్నికవుతూ వచ్చారు. మధ్యలో కొన్ని లోక్‌సభ ఎన్నికలను మినహాయిస్తే కేసీఆర్ లేదా ఆయన కుటుంబసభ్యులు ఎవరో ఒకరు ప్రతి ఎన్నికలోనూ పోటీ చేస్తూ వస్తున్నారు. కేసీఆర్ బంధువు బోయినపల్లి వినోద్ కుమార్ మాత్రం కరీంనగర్ నుంచి ప్రస్తుతం లోక్ సభ బరిలో నిల్చొంటున్నారు.