KCR: కాంగ్రెస్ పై కేసీఆర్ స్వారీ, ఎన్డీయే ముద్రలో వైసీపీ, టీడీపీ

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సీఎం KCR బాగా దగ్గర అవుతున్నారు. ఢిల్లీ అధిష్టానం కూడా బీ ఆర్ ఎస్ కు మద్దతుగా ఉంది. అందుకు నిదర్శనం కర్ణాటక సీఎం సిద్దిరామయ్య ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందటం.

  • Written By:
  • Updated On - May 19, 2023 / 11:52 AM IST

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సీఎం KCR బాగా దగ్గర అవుతున్నారు. ఢిల్లీ అధిష్టానం కూడా బీ ఆర్ ఎస్ కు మద్దతుగా ఉంది. అందుకు నిదర్శనం కర్ణాటక సీఎం సిద్దిరామయ్య ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందటం. భావసారూప్యత ఉన్న పార్టీలకు ఇన్వెటేషన్ పంపిస్తున్నారు. ఆ జాబితాలో వైసీపీ , టీడీపీ లేకపోవటం గమనార్హం. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ రెండు పార్టీలు దూరంగా ఉంటున్నాయి. అంతే కాదు మోడీ పాలన , విజన్ కు చంద్రబాబు జైకొడుతున్నారు. అదే తరహాలో జగన్ సహజ మిత్రునిగా బీజేపీ కి మేలుగుతున్నారు. అందుకే వాళ్ళను కాదని KCR కు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలకు సిద్ధి రామయ్య పంపిన ఆహ్వానం.

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ఈ నెల 20 న బెంగళూరులోని కంఠీవ స్టేడియంలో మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్ధరామయ్య రెండోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ,ప్రియాంక చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నారు.

వీరితో పాటు సిద్దారామయ్య ప్రమాణస్వీకారోత్సవానికి తమిళనాడు, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఒడిశా ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపింది కాంగ్రెస్. తెలంగాణ సీఎం KCR కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కాంగ్రెస్ ఆహ్వానించింది. అయితే ఏపీ సీఎం జగన్ కు మాత్రం ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరు అవుతారని తెలుస్తుంది.

సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి తమ మిత్రపక్షాలందరినీ ఆహ్వానిస్తామని కర్ణాటక ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు. ప్రజా సేవే తమ పార్టీ ఏకైక సూత్రమని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలనుకునే వారు ఎంత కావాలంటే అంత చేయవచ్చునని చెప్పారు. ఇది ఓ సెలబ్రేషన్ గా లేదా వేడుకగా తాము భావించడం లేదని, ప్రజాస్వామ్యం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న అంకితభావానికి నిదర్శనం అని అన్నారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడాలనుకునే వారు, రాజ్యాంగాన్ని కాపాడాలనుకునే వారు అందరూ ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కావొచ్చునని చెప్పారు.

కాగా, మే 20వ తేదీ మధ్యాహ్నం గం.12.30 సమయానికి కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భావసారూప్యత కలిగిన పార్టీలను అన్నింటినీ ఈ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు. సిద్ధరామయ్య కేబినెట్లో శివకుమార్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉండనున్నారు.ఈ వేడుక రాబోవు రోజుల్లో యూపీఏ కూటమికి బలమైన బాట వేయనుంది. సాధారణ ఎన్నికల నాటికి బీ ఆర్ ఎస్, కాంగ్రెస్ పొత్తు దిశగా ఈ కార్యక్రమం ఉండనుంది. అసెంబ్లీ ఎన్నికల వరకు దూరంగా ఉన్నప్పటికీ ఆ రెండు పార్టీలు ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనిపిస్తుంది. తెలంగాణలో బలపడిందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్న సమయంలో కాంగ్రెస్ వేదికను కేసీఆర్ వ్యూహాత్మకంగా పంచుకో బోతున్నారు. ఫలితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టాన్ని కలిగిస్తుందని సర్వత్రా వినిపిస్తుంది.

Also Read:  TDP : జ‌గ‌న్‌ది పేద‌ల‌ను దోచుకునే ప్ర‌భుత్వం.. ఎస్‌.కోట “ఇదేం ఖ‌ర్మ” కార్య‌క్ర‌మంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు