KCR and Jagan: ఇద్దరు ఇద్దరే! సంజీవయ్య నీతి వాళ్లకు బహు దూరం!

ఇద్దరు సీఎంలు గత ముఖ్యమంత్రుల చరిత్రను చూడాలి. ఏపీ తొలి దళిత సీఎం దామోదర సంజీవయ్య పాలన అవలోకనం చేసుకోవాలి.

  • Written By:
  • Updated On - February 20, 2023 / 01:03 PM IST

తెలంగాణ వస్తే దళిత సీఎంను చేస్తా అంటూ కేసీఆర్ (KCR) చెప్పిన మాట అందరికి తెలుసు. కాపలా కుక్కలగా ఉంటానని చెప్పిన ఆయన బంగారు తెలంగాణ కోసం నేనే సీఎం కావాలని ప్రజలు అనుకున్నారని ఇప్పుడు చెబుతున్నారు. తెలంగాణ (Telangana) గాంధీ గా చరిత్రలో నిలవాలని పుస్తకాలు అభ్యాసంగా చేస్తున్నారు. మరో వైపు జగన్ (CM Jagan) అన్ని చోట్లా స్టిక్కర్లు వేసుకుంటూ ప్రచార పిచ్చిలో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. ఈ ఇద్దరు సీఎంలు గత ముఖ్యమంత్రుల చరిత్రను చూడాలి. ప్రత్యేకించి ఉమ్మడి ఏపీ తొలి దళిత సీఎం దామోదర సంజీవయ్య పాలన అవలోకనం చేసుకోవాలి. అవినీతి మరక అంతని మహా నాయకుడు స్సంజీవయ్య. దళితులకు సీఎం ఇస్తే ఎలా ఉంటుందో నిరూపించారు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీకి రిక్షాలో వెళ్ళేవారంటే ఎంతటి ఉన్నతుడో అర్ధం చేసుకోవచ్చు. సంజీవయ్య (Damodaram Sanjivayya) కర్నూలు జిల్లా లోని కల్లూరు మండలంలోని పెద్దపాడు అనే గ్రామంలో దళిత కుటుంబంలో 14 ఫిబ్రవరి 1921 లో మునెయ్య , సుంకులమ్మ దంపతులకు ఐదుగురి సంతానంలో ఆఖరివానిగా దామోదరం సంజీవయ్య జన్మించారు . ఏ విధమైన ఆస్తి పాస్తులు లేక పోవడంతో నేత పని , పొలం పనులకు వెళ్ళేవారు. సంజీ వయ్య జన్మించిన మూడవ రోజునే తండ్రి మరణించడంతో మేనమామ ఇంటికి పాలకుర్తి వెళ్ళారు. మూడు ఏళ్ల తరు వాత పెద్దపాడు తిరిగి వచ్చాడు . సోదరుడు చిన్నయ్య కుటుంబ భాద్యత తీసుకుని సంజీవయ్యను చది వించాడు.

పెద్దపాడులో 5 వ తరగతి వరకు చదివి , కర్నూల్ లోని అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ పాఠశాలలో చేరారు. 1935 లో కర్నూల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చేరి 1938 లో SSLC లో జిల్లా ప్రధమునిగా ఉత్తీర్ణత సాధించాడు. అనంతపురం దత్తమండల కళాశాలలో గణితం , ఖగోళ శాస్త్రాల్లో అద్య యనం చేసారు. 1942 లో BA పూర్తి చేసి చిన్న చిన్న ఉద్యోగా లు చేసాడు. బ్రిటీష్ (British) ప్రభుత్వ పాలన కాలంలో కర్నూల్ రేషన్ అందించే కార్యాలయంలో రూ. 48ల వేతనానికి పని చేసారు. 1944 లో మద్రాస్ లోని కేంద్ర ప్రజాపనుల శాఖ కార్యాలయంలో సహాయకునిగా కొంతకాలం పనిచేసారు. 1945 లో అదే శాఖలో తనిఖీ అధికారిగా బళ్ళారిలో 11 నెలల పాటు ఉన్నారు. ఆ తరువాత మద్రాస్ పచ్చాయప్ప పాఠశాలలో ఉపాధ్యాయు నిగా చేరారు. 1946 లో బళ్ళారి జిల్లా జడ్జి కె.ఆర్ కృష్ణయ్య చెట్టి ప్రోత్సాహంతో మద్రాస్ లా కాలేజీ లో FL లో చేరారు. అప్పుడు దానిలో స్కాలర్ షిప్ అవకాశం లేనందువల్ల మద్రాస్ జార్జ్ టౌన్ లోని ప్రొగ్రెసివ్ యూనియన్ ఉన్నత పాఠశాల లో స్వల్ప కాలిక గణిత ఉపా ధ్యాయునిగా పనిచేయగా రూ. 90 జీతంగా రావడంతో దాన్ని హాస్టల్ ఖర్చులకు ఇచ్చే వారు. లా చదివే సమయం లో ప్రముఖ రచయిత రావిశాస్త్రి గారు సహాధ్యాయి. సంజీవయ్య మాల , దాసరి కులం అవ్వడం వల్ల వసుధా మాల – దాసర్లు కళాకారులు అవ్వడం వల్ల కళాభిరుచి అబ్బింది . లా చదివే కాలంలో చంద్రగుప్త నాటకంలో నటించారు. శివాజి అనే నాటకాన్ని తానే రచించి , ప్రదర్శించారు. గయోపాఖ్యానం ను గద్యంగా రచించారు. లా పట్టాను పొంది 1950 అక్టోబర్ లో మద్రాస్ (Madras) బార్ లో న్యాయవాది గా నమోదు చేసుకున్నారు. జాస్తి సీతామహాలక్ష్మమ్మ , గణ పతి గార్ల వద్ద సహాయకునిగా పనిచేసారు. లా అప్రెంటిస్ చేస్తుంన్నందువల్ల వివిధ రాజకీయ నాయకులతో పరిచయం ఏర్పడింది.

తెలుగు , ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడడం వల్ల మంచి వక్త అయ్యారు. ఒకసారి NG రంగా గారు జాస్తి సీతా మహాలక్ష్మమ్మ వద్దకు పని ఉండి రావడంతో ఆవిడ సంజీవయ్యను పరిచయం చేసింది. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగం అమలు లోకి రావడంతో అప్పటివరకు రాజ్యాంగ రచన నిర్వహించిన రాజ్యాంగ సభ ప్రొవిజినల్ పార్లమెంట్ గా అవతరించింది . అయితే ప్రొవిజినల్ పార్లమెంట్ , రాష్ట్ర శాసనసభ లలో రెండింటి లోనూ సభ్యత్వం ఉన్నవారు ఏదో ఒకటి వదలు కోవాలనే నియమం ఉన్నందున SC వర్గానికి చెందిన ఎస్. నాగప్ప తన ప్రొవిజినల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని వదలుకున్నారు. అప్పుడు రాజాజీ NG రంగా SC వర్గానికి చెందిన మంచి వ్యక్తిని చూడమనగా ఆయన జాస్తి సీతామహాలక్ష్మమ్మ చెప్పడంతో ఆమె సంజీవయ్య (Damodaram Sanjivayya) పేరు సూచించారు. రంగా మరో ఆలోచన లేకుండా సంజీవయ్యను అడుగగా మొదట రాజకీయాలలోకి రావడం ఇష్ఠం లేదని చెప్పడం జరిగింది . కోట్ల విజయ భాస్కర రెడ్డి గారు , సరసప్ప అనే స్నేహితుడు కూడా నచ్చజెప్పడంతో ఎ.పి కాంగ్రెస్ పార్టీ తరుపున సంజీవయ్యను ఎంపిక చేయ డంతో రాజకీయాలు ఇష్ఠంలేక పోయినా 29 ఏళ్ల వయస్సులో 1950 లో ప్రొవిజినల్ పార్లమెంట్ మెంబర్ అయ్యాడు. ఎన్నికలు జరిగి తొలి విధానసభ ప్రమాణ స్వీకారం చెయ్యడంతో 1952 మే 7 న ప్రొవిజినల్ పార్లమెంట్ రద్దయ్యింది. అప్పుడు మద్రాస్ శాసన సభ్యునిగా ఎన్నికై రాజాజీ మంత్రి వర్గంలో గృహనిర్మాణం, సహకార శాఖల మంత్రిగా 1952 ఏప్రిల్ 20 నుండి 1953 అక్టోబర్ 1 వరకు పనిచేసారు . తరువాత అక్టోబర్ 1 నుండి 1954 వరకు టంగుటూరి ప్రకాశం మంత్రి వర్గంలో ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్య , హరిజనోద్ధరణ , పునరావాస శాఖామంత్రిగా పనిచేసారు.

ప్రకాశం మంత్రి వర్గంలో పనిచేసే సమయంలో సికింద్రాబాద్ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేసే కృష్ణవేణి తో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. 1955 నుండి 1956 నవంబర్ 1 వరకు బెజవాడ గోపాల రెడ్డి మంత్రి వర్గంలో ఎ.పి రాష్ట్ర రవాణా, వాణిజ్య పన్నుల శాఖ నిర్వహించారు. 1956 నవంబర్ 1 నుండి 1960 జనవరి 10 వరకు శ్రీ నీలం సంజీవ రెడ్డి మంత్రివర్గంలో శ్రమ , స్థానిక స్వపరిపాలన శాఖలు నిర్వహించారు. నీలం సంజీవరెడ్డి తన పత్యర్ధి పిడతల రంగారెడ్డిని దెబ్బ తీయాలని కర్నూల్ జిల్లాలోని బస్సు రూట్లను జాతీయం చేసారు. అప్పుడు సుప్రీంకోర్ట్ ప్రభుత్వం పై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో నీలం సంజీవరెడ్డి రాజీనామా చేసారు. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నెహ్రూ సంజీవయ్య ని ఎన్నిక చేయడంతో మొట్టమొదటి సారిగా దళిత ముఖ్యమంత్రి గా సంజీవయ్య (Damodaram Sanjivayya) 1960 జనవరి 11 న ప్రమాణ స్వీకారం చేసారు. సంజీవయ్య ఎన్నికకు పెద్ద తతంగమే జరిగింది . సంజీవయ్యను ఎన్నిక చేస్తారని తెల్సిన అనేకులు ఢిల్లీ వెళ్ళి సంజీ వయ్య అవినీతిపరుడని పితూరీలు చెప్పారు . విసిగిన నెహ్రూ నమ్మకమైన వ్యక్తితో రహస్య విచారణ చెయ్య మనగా ఆ వ్యక్తి హైద్రాబాద్ వచ్చి శాసన మండలి చైర్మన్ చక్రపాణి గారిని కల్సి , వచ్చిన విషయం చెప్పాడు. చివాట్లు పెట్టారు చక్రపాణి . సంజీవయ్య ఎంత ఉన్నతుడో వివరించాడు . అయినా వచ్చిన వ్యక్తి వినకుండా నెహ్రూ గారి మాటను జవదాటే ప్రశ్న లేదు , సంజీవయ్య స్వగ్రామం వెళ్ళ వలసిందే అని పట్టు బట్టాడు.

చేసేది లేక కారు వేసుకుని సంజీవయ్య గ్రామం వెళ్ళి ఒక పూరి గుడిసె ముందు కారు ఆపగా ఎదురుగా కట్టెల పొయ్యిని వెలిగించి గొట్టంతో పొగను ఊదుతున్న ఒక ముసలావిడ కనిపించింది. ఢిల్లీ నుండి వచ్చిన వ్యక్తి ఎగాదిగా చూస్తూ ఏమిటి ఇక్కడ ఆపారు అనగా, దిగండి ఇదే సంజీవయ్య ఇల్లు , ఆవిడే సంజీయయ్య తల్లి అన్నాడు చక్రపాణి. అమ్మా ! మంత్రిగా ఉన్న మీఅబ్బాయి ముఖ్యమంత్రి (Cheif Minister) అవ్వబోతున్నాడమ్మా , అని చక్రపాణి చెప్పగా , జీతం ఏమైనా పెరుగుతుందా , కట్టెల పొయ్యితో వంట చెయ్యకేక , ఊదలేక పోతున్నా , బొగ్గుల పొయ్యి కొనమని మా అబ్బాయిని అడిగితే డబ్బులు లేవు అని అంటున్నాడు అని చెప్పింది. నోటమాట రాని ఢిల్లీ వ్యక్తి నిలబడి చూస్తుండి పోయాడు. ఏమండి , గ్రామంలోకి వెళ్ళి పెద్దలను విచారించి వద్దామా అని అడుగగా , అవసరం లేదు కారు వెనక్కు తిప్పండి , హైద్రాబాద్ వెళదాం అన్నాడట . ఆ తరువాత వెంఠనే 39 ఏళ్ల సంజీవయ్య ఎ.పి తొలి దళిత ముఖ్యమంత్రి అయ్యారు.1960 మే 6 న అఖిల భారత తెలుగు రచయితల మహా సభలు హైద్రాబాద్ లో నిర్వహింపజేసారు సంజీవయ్య గారు . ఇంత చరిత్ర ఉన్న దళిత సీఎం బంగారు తెలంగాణ నిర్మించలేరా? ఆలోచించాలి.

Also Read: Taraka Ratna Dream: నెరవేరని ‘తారకరత్న’ కల.. బాబాయ్ బాలయ్యతో నటించకుండానే!