స్కిల్ డెవలప్ మెంట్ కేసు లో చంద్రబాబు (Chandrababu Arrest)ను అరెస్ట్ చేయడం పట్ల ఏపీలో లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా తప్పుపడుతున్నారు. రాజకీయ పార్టీ అలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో తమ నిరసనలను తెలియజేయగా..తాజాగా ఐటీ ఉద్యోగులు (IT Professionals) సైతం ‘ఐయాం విత్ సీబీఎన్'(‘I am with CBN’) అంటున్నారు. చంద్రబాబు సీఎం గా ఉన్న టైములో ఐటీ ని ఎంత డెవలప్ చేసారో చెప్పాల్సిన పనిలేదు.
హైదరాబాద్ (Hyderabad ) ను ఐటీ హబ్ గా మార్చిందే చంద్రబాబు. అప్పటివరకు ఐటీ అంటే తెలియని వారు సైతం చంద్రబాబు ఐటీ ని డెవలప్ చేసిన తర్వాత అంత ఐటీ రంగం వైపు దృష్టి పెట్టారు. ఇప్పటికి హైదరాబాద్ లో ఐటి రంగం ఎంత అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు వల్లే అని ప్రతి ఒక్కరు చెపుతారు. అంతలా ఐటీ ని అభివృద్ధి చేసిన చంద్రబాబును ఓ తప్పుడు కేసులో అరెస్ట్ చేయడం ఏంటి అని వారంతా ప్రశ్నిస్తూ రోడ్ల మీదకు వస్తున్నారు.
Read Also : Inspections : రాజమండ్రి సెంట్రల్ జైల్లో అర్ధరాత్రి తనిఖీలు..ఏం జరగబోతుంది..?
ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ (Wipro Circle) వద్ద ఐటీ ఉద్యోగులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ‘ఐయాం విత్ సీబీఎన్’ పేరుతో మెయిల్స్, సోషల్ మీడియా ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఇన్విటేషన్ షేర్ అవుతోంది. ‘రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కుట్రలో చంద్రబాబు బాధితుడు. ఈ సంక్షోభ సమయంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది’ అంటూ దీనికి సంబంధించిన పోస్టర్ లో పేర్కొన్నారు.