తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) వాడివేడిగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. ఇటీవల వరదలకు దెబ్బతిన్న మేడిగడ్డ ప్రాజెక్ట్ (Medigadda Project)ను చూసేందుకు నేడు అధికారికంగా ప్రభుత్వం పర్యటనకు సిద్ధం కాగా.. శాసన సభలోని సభ్యులందరూ ఈ పర్యటనలో ఉండాలని, అంతేకాకుండా.. ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) సైతం ఈ పర్యటనకు హాజరుకావాలని అధికార కాంగ్రెస్ శ్రేణులు అసెంబ్లీలో బీఆర్‌ఎస్ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో ఈ పర్యటనకు ముందు అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. శాసన సభ జరిగిన జరుగుతున్న తీరు ఖండిస్తున్నామన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మీరు మాట్లాడి, మాకు మైకులు మాకు ఇవ్వక పోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ప్రజాస్వామ్య విలువలను మంట గలిపే విధంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదని, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల ఉపయోగం… వీటన్నింటి సమాహారం కాళేశ్వరమని హరీష్ రావు ఉద్ఘాటించారు. ఒక బ్యారేజీలో ఒకటి రెండు కుంగి పోతే కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారంటూ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మీరు వెళ్ళే దారిలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కుడెల్లి వాగు, పచ్చటి పొలాలు చూడండని, కాళేశ్వరం ఫలితాలు రైతును అడగండని, కర్ణాటక నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చి రంగనాయక సాగర్ చూశారు.
అద్బుతం అని మెచ్చుకున్నారని హరీష్ రావు అన్నారు. చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాంతంలో ప్రాణహిత కట్టాలని చూస్తే అనేక అడ్డంకులు సృష్టించారని ఆయన ధ్వజమెత్తారు. కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలో నాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది ఎందుకు ప్రాణహిత చేవెళ్ల కట్టలేదని హరీష్ రావు ప్రశ్నించారు. మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండింది అంటే ఆ జలాల వల్లే అని ఆయన వెల్లడించారు. తప్పు జరిగితే చర్య తీసుకోండి, పునరుద్దరణ పనులు చేయండని, దురుద్దేశంతో ప్రాజెక్ట్ పునరుద్దరణ చేయడం లేదు. అద్భుతంగా నిర్మించి నీల్లు ఇస్తున్నామన్నారు హరీష్ రావు. రైతులను ఇబ్బంది పెట్టకండని, నష్ట పోతారని, ప్రజలు కాంగ్రెస్‌ను క్షమించరన్నారు. కాంగ్రెస్ హయాంలో పంజాగుట్ట ఫ్లై ఓవర్ కూలి 20 మంది చనిపోయారని, దేవాదుల పైపులు పేలి నీళ్ళు ఆకాశమంత ఎగిరాయని, అలాంటి ఘటనలు జరగటం బాధాకరమని, కానీ ముందుకు వెళ్ళాం కదా అని ఆయన అన్నారు. ప్రాజెక్టులు అప్పగించ వద్దని మేము నిద్ర లేపితే లేచారని, ఈరోజు మా సభ ఉందని మీరు డైవర్ట్ కోసం పోటీ కార్యక్రమం పెట్టారని, మీ నీతిని ప్రజలందరూ గమనిస్తున్నాని మండిపడ్డారు హరీష్ రావు.
Read Also : CM Jagan : నేడు ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలు.. హాజరుకానున్న సీఎం