Site icon HashtagU Telugu

Election Campaign : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం

Election Campaign Over In Telugu States

Election Campaign Over In Telugu States

రెండు నెలలుగా మోతమోగించిన మైకులు మూతపడ్డాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (AP & Telangana) పాటు నాలుగో దశలో ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో ప్రచారం ముగిసింది (Election campaign over). మే 13న దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 96 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. తెలంగాణ లో 17 లోక్ సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక జరగనుండగా..ఏపీలో 175 అసెంబ్లీ , 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ జరగనుండగా.. జూన్‌ 4న ఓట్ల ఫలితాలు వెల్లడించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నికల ప్రచారం ముగియడంతో బైట నుంచి వచ్చిన వారంతా ఎన్నికల ప్రదేశాలనుంచి వెళ్లి పోవాలని ఈసీ ఆదేశించింది. కేవలం ఆ గ్రామం, నియోజక వర్గం, స్థానికంగా ఓటు హక్కు ఉన్న వారు మాత్రమే ఉండాలని మిగతా వారు మాత్రం వెళ్లిపోవాలని ఈసీ స్పష్టం చేసింది. పోలీసులు పకట్బందీ చర్యలు చేపట్టాలని ఎలాంటి ప్రలొభాలకు గురిచేసే ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఈసీ సూచించింది. ఇక దేవాలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలలో మాత్రం బైటవారు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఇక ఎన్నికలు జరిగే ప్రాంతాలలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చేసిందని ఈసీ తెలిపింది. ఎక్కడ కూడా నలుగురు ఒక చోటు గుమిగూడి కన్పించకూడదంటూ ఈసీ తెలిపింది. బల్క్ ఎస్ఎమ్మెస్ లు, సైతం పంపవద్దంటూ ఈసీ స్పష్టం చేసింది.

ఫెసిలిటేషన్‌ సెంటర్లలో 4,44,216 పోస్టల్‌ బ్యాలెట్లు పోలయ్యాయని చెప్పారు. ఏపీలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను 4,44,216 ఓట్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 4,44218 పోస్టల్‌ బ్యాలెట్లు పోలైనట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు.

Read Also : Lok Sabha Elections 2024: ములుగు జిల్లాలో 144 సెక్షన్‌ విధిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ