HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Deputy Cm Bhatti Vikramarka Lashes Out At Brs

Bhatti Vikramarka: బీఆర్‌ఎస్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఫైర్

  • Author : Vamsi Chowdary Korata Date : 09-06-2026 - 3:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bhatti Vikramarka (1)
Bhatti Vikramarka (1)

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ నాయకులపై, ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరంగల్ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తుంటే… హరీష్ రావు మాత్రం అబద్ధాలు ప్రచారం చేయడంలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. “రాష్ట్ర క్యాబినెట్ రోజుకు 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తుంటే.. హరీష్ రావు నిత్యం అబద్ధాలు చెబుతున్నారు” అని భట్టి విమర్శించారు.

పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుని, దివాలా తీయించిందని ఆయన ఆరోపించారు. మరి నాడు అధికారంలో ఉన్నప్పుడు పేదలకు సన్నబియ్యం ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వ విజయాలను ఆయన పంచుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే 76,000 ప్రభుత్వ ఉద్యోగాలు అందించిందని, రైతులకు అండగా నిలుస్తూ తడిసిన, దెబ్బతిన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తోందని తెలిపారు. అలాగే రుణమాఫీ పథకాన్ని నిలకడగా అమలు చేస్తున్నామని చెప్పారు.

బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన దేవాదుల ప్రాజెక్టును తాము వేగవంతం చేశామన్నారు. గత ప్రభుత్వం డిస్కమ్‌లకు బకాయిలు పెట్టడం వల్లే విద్యుత్ సమస్యలు వచ్చాయని, తాము ఆ బకాయిలను చెల్లిస్తూ విద్యుత్ సరఫరాను మెరుగుపరిచామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేరుస్తున్నామని చెప్పారు. రఘునాథపల్లిలో 230 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bhatti vikramarka
  • brs party
  • Congress Government
  • harish rao
  • power projects
  • Telangana Congress Govt

Related News

CM Chandrababu: Chandrababu Responds to Pawan's Meeting in Telangana

CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తెలంగాణకు చెందిన కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు గడిచిపోయాయని.. ప్రశాంతతను చెడగొట్టవద్దని సూచించారు. ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడాలి కానీ.. ఇలాంటి వాటిలో కాదన్నారు. తెలంగాణకు ఎవరు ఎంత చేశారనే దానిపై అక్కడి ప్రజలకు అవగాహన ఉందని చంద్రబాబు అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన

  • KTR Delivers Strong Counter to Pawan's Remarks

    KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Latest News

  • Marriage: వివాహం జరగడం లేదని బెంగ పడుతున్నారా? అయితే 21 శనివారాలు ఈ పని చేయండి..!!

  • Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంటికి సీఐడీ

  • Manjari Fadnnis: తన కుక్కను దారుణంగా కొట్టి చంపేశారు : నటి మంజరి ఫడ్నీస్ కన్నీళ్లు

  • Sunny Leone: సన్నీ లియోన్‌కు సీఐడీ నోటీసులు.. రూ.2,400 కోట్ల భారీ స్కామ్

  • Apache Helicopter: హోర్ముజ్ జలసంధిలో కుప్పకూలిన అమెరికా అపాచీ హెలికాప్టర్!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd