CSR Analysis : ఓట్ల పోస్టుమార్టం , బహు పరాక్ , నిర్లక్ష్యం చేస్తే గల్లంతే!

జాతీయ పార్టీ లైన కాంగ్రెస్ కు లౌకికతత్వం , బి.జె.పి కి హిందుత్వం , కమ్యూనిస్ట్ లకు వర్గ , ఆర్ధిక , సామాజిక తారతమ్యాలు లేని సిద్ధాంత పునాదులు ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - January 22, 2023 / 07:00 AM IST

జాతీయ పార్టీ లైన కాంగ్రెస్ కు లౌకికతత్వం , బి.జె.పి కి హిందుత్వం , కమ్యూనిస్ట్ లకు వర్గ , ఆర్ధిక , సామాజిక తారతమ్యాలు లేని సిద్ధాంత పునాదులు ఉన్నాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలకు ఆయా రాష్ట్ర పరిస్థి తులపై సిద్ధాంతాన్ని రచించు కుని రాజకీయాల్లో నడుస్తూ వస్తున్నాయి. ద్రావిడ జాతిపై ఉత్తరాది ఆర్య పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ తమిళ ప్రాంతీయ పార్టీలు ఉద్భవించాయి. (Tamilnadu) అలాగే APలో ఆత్మగౌరవం నినాదం మీద తెలుగుదేశం (Telugu Desam Party) పుట్టుకు వచ్చింది . కాంగ్రెస్,(Congress Party) కమ్యూనిస్ట్ ల ఏలుబడిలో ఉన్న అవలక్షణాలను ఎత్తి చూపి బెంగాల్ లో మమత పార్టీ (Mamata Benarjee) అధికారంలోకి వచ్చింది. యు. పి లో మాయావతి (Mayavathi), బీహార్ దళ్ , ఓడిస్సా లో బిజూ దల్ (Biju Dal) , జార్ఖండ్ లో హేమంత్ సురేన్ ముక్తి మోర్చ(Mukti Morcha) , జమ్ము – కాశ్మీర్ లో పి . డి. పి (Peoples Democratic Party) , నేషనల్ కాన్ఫరెన్స్ ఒమర్ అబ్దుల్లాలు , ప్రస్తుత ఎ.పి లో అధికార వై.సి.పి ఇవన్నీ వారసత్వ పునాదుల మీద నిర్మించిన , కొనసాగుతున్న పార్టీలు .

ఈ వారసత్వ పార్టీలన్నీ ఉవ్వెత్తున పుట్టుకొచ్చి , ఎగసిపడి చప్పున చల్లారి పోతున్నాయి. ఇక్కడే ఒక మతలబ్ ఉంది. ఇవన్నీ అధికారం లోకి రాగలిగినా ప్రజానాడిని తమకు అనుకూలంగా మలచుకోలేక విఫలమై చతికిలపడు తున్నాయి . అవినీతిలో కూరుకు పోవడమో, బంధు ప్రీతికి లోను కావడమో , కులాన్ని ఎక్కువగా ప్రమోట్ చెయ్యడమో రక రకాల కారణాల వల్ల ఆశించిన ఫలితాలు సాధించలేక పోతున్నారు. దీనిలో కొంత వరకు పరిమిత వనరుల కారణంగా డబ్బును రాజకీయంలో కుమ్మరించ లేక పోవడం కూడా మరొక కారణం. వారికి అనుకూల టివి ని , పేపర్ లాంటివి స్థాపించు కోలేక పోవడం వల్ల వారి పార్టీలకు బాకాలూదే ప్రసార మాద్యమాలు లేక కొంత వెనకడుగుకు కారణం. అదే ఎ.పి నే తీసుకోండి లక్షల కోట్లకు అధినేత యైన వై.సి.పి నేత ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ పార్టీ పదివేల కోట్లు అవలీలగా ఎడం చేత్తో విసిరేయగలదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

పైగా సొంత టి.వి , దిన పత్రిక చేతిలో ఉన్నాయి . అవే కాక వందల కోట్లు వెచ్చించి పార్టీని , ప్రభుత్వాన్ని దిశానిర్దేశం చేసే ఎన్నికల వ్యూహకర్త PK ఉన్నాడు. ఇంకా ఇవన్నీ కాక పదుల సంఖ్యలో ప్రజల మద్య చీలికలు తెచ్చే సలహాదారుల బృందం ఉంది. సింగిల్ గా ఒంటి చేత్తో తనకు కావల్సిన అభ్యర్ధులను నిలబెట్టి గెలిపించుకో గలడని , కారణం అన్నీ తన సొంత వనరులు కాబట్టి , ఇన్ని వనరులు ఉన్న రాజకీయ నాయకుడు భారత దేశంలో ఎవరూ లేరని , సిద్ధాంత పునాది లేక పోవడం అనేది ఒక్కటే ఆ పార్టీకి మైనస్ అవుతున్నదని చెబుతున్నారు. ఎప్పుడైనా ఉంగరాల చేత్తో మొడితేనే విలువ. డబ్బున్న రాజకీయ పార్టీకి , నాయకులకు మాత్రమే ఆదరణ లభిస్తోంది. ఏ పార్టీలు చూసినా కులాన్ని బట్టే సీట్లు కేటాయిస్తున్నాయి . బడుగు , బలహీన వర్గాల్లో కూడా ఆర్ధిక స్థితిమంతులను మాత్రమే పార్టీలు నిలుపుతున్నాయి. అభ్యర్ధి వ్యక్తిత్వం , నిజాయితీతో పని లేదు. కేవలం క్యాష్ & కాస్ట్ ఉంటే ఏ పార్టీలోనైనా నెట్టుకు రావొచ్చు. విశేష మేమిటంటే వ్యూహకర్తల చేతిలోకి పార్టీ వెళ్ళిపోవడం , వారు చెప్పి నట్లుగా అధినేత నడచు కోవడం , మిమ్మల్ని పీకేస్తా , పాతరేస్తా అని బెదిరించడం చేస్తున్నారు . ఈ వ్యూహకర్తలు చెబుతారు ఏ కులంలో కుంపట్లు రగిలించాలో , ఏ ప్రాంతంలో చిచ్చుపెట్టాలో సూచనలు చేస్తారు. వాటిని అధికార పార్టీ సలహా దారుల బృందం నొప్పి పుట్టని ఇంజక్షన్ ద్వారా కొద్ది కొద్దిగా జనుల మెదళ్ళలో విష బీజాలు నాటుతారు. డప్పుకొట్టే మీడియా ఎలాగూ ఉంటుంది కాబట్టి వెంఠనే అభూత కల్పనలతో వార్తలు వండి వడ్డించేస్తారు . ఇంకేముంది సెకన్లలో లక్షల ఫోన్ల లోకి ఫేక్ వార్తలు విడుదలై పోతాయి.

ముఖ్యంగా యువతరం ఈ గాసిప్ వార్తలకు (Fake Gossip News) లొంగి పోతారు. వారిలో కుల తత్వమో, మతతత్వమో , సినీ నటుడి మోజుతోనో విజృంభించి మరింత మందికి ఆ ఫేక్ వార్తలను వెదజల్లు తారు. ఇక పెద్దల ఓట్లకు మత స్వాములు , కుండలు పగుల కొట్టే కుల నాయకులు , మేతా వులుగా మారిన మేధావి వర్గం ఎలాగూ తయారుగా ఉంటారు , వీరంతా టి.వి ల ముందుకు వచ్చి తమ తమ పాండిత్యాన్ని ప్రదర్శిస్తారు . క్యాష్ , కాస్ట్ మాత్రమే కాదు , ఇంకేవో కావాలి ప్రజలకు. అవి PK లాంటి వ్యూహకర్తల మోసపు మాటలు , కల్లబొల్లి కబుర్లు , పిట్టల దొరల మాటలు కూడా ఓటింగ్ లో చాలా ప్రభావం చూపిస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఇరు పక్షాల వారు ఓట్లకు డబ్బులు ఇచ్చినప్పుడు ఈ PK వ్యూహ కర్తల మాయ మాటలు పనిచేసి గెలుపుకు కొంతమేర కారణ మవుతోందనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ఇక తప్పక ఇప్పుడు అన్ని పార్టీలు వ్యూహకర్తలను పెట్టుకోక తప్పడం లేదు . ప్రజా నాడిని తెల్సుకోవడంలో ఈ వ్యూహకర్తల వార్తా సేకరణ ఉపయోగపడే మాట నిజం. కానీ సేకరణకు మాత్రమే వారు పరిమితం కాకుండా ప్రజల్లో విషబీజాలు నాటడానికి తమ శక్తి యుక్తులను వాడి సమాజాన్ని కులాలుగా చీలిక పీలికలు చేస్తున్నారు. ఈ ఎన్నికల వ్యూహకర్త PK మహాశయుడు CM , PM లను నేనే చేసానని , నా తెలివినంతా వీరికి ఎందుకు ధార పోయాలని , నేనే నిలబడితే పోలా అని తన అదృష్ఠాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో రోడ్ల వెంబడి తిరుగుతున్నాడు. ఇక్కడ ప్రధాన సమస్య వ్యక్తుల డేటా. ఆధార్ అనుసంధానంతో అందరి జాతకాలూ డేటా రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి . ఈ డేటా చోరీ చేసి ప్రతి ఓటరు కుల , మతాలను లెక్కించి , విడగొట్టి కుల , మత రాజకీయాల పధకాలను రచిస్తున్నారు. ఓటర్లను లక్షల్లో తొలగిస్తూ, మరలా కొత్తవి నమోదు చేస్తూ వికృత క్రీడను ప్రదర్శిస్తున్నారు.

ఓటు వున్నదో , ఊడిందో మనకు తెలియదు. అన్నిటికీ మెస్సేజ్ లను పంపుతున్న ప్రభుత్వం ఓటును రద్దు చేసేడప్పుడు మాత్రం మెస్సేజ్ పంపదు. ఇ సేవ కేంద్రంలో మరలా ఓటు నమోదుకు 100/- రూ. లు తీసుకుంటున్నారు . ఓటు వస్తుందో , రాదో తెలియదు , 15 రోజుల లోపు మెస్సేజ్ వస్తుంది అని ఇ సేవ కేంద్రం వారు చెబుతున్నారు. ఎందుకు తొలగించారు అంటే మాకు తెలియదు అని చెబుతున్నారు. 10 సం.ల నుండీ ఓటు వేస్తున్నా , సొంత ఇంట్లో కాపురం ఉంటున్నా ఓట్లను తొలగిస్తున్నారు. హైద్రాబాద్ , విజయవాడ , విశాఖపట్నం లాంటి నగరాలు , పట్టణాల్లో తొలగింపులు ఎక్కువుగా ఉంటున్నాయి. ఇంట్లో ఓటర్ కార్డ్ ఉంది అని సంతృప్తి పడవద్దు, నెట్ లో చూసి నిర్ధారించుకోండి.