Site icon HashtagU Telugu

Kadiam : కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తోందిః కడియం శ్రీహరి

111

Congress govt is trying to throw mud on BRS.. Kadiyam Srihari

 

telangana-development : తెలంగాణ భవన్ నుంచి ‘ఛలో నల్గొండ’ బహిరంగసభకు బయలుదేరే ముందు కడియం శ్రీహరి  మీడియాతో మాట్లాడారు. కేసీఆర్(kcr) చేసిన అభివృద్ధి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి (revanth-reddy-government) కనిపించడం లేదని… తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని బీఆర్‌ఎస్(brs) ప్రభుత్వం గత పదేళ్లుగా అడ్డుకుందని చెప్పారు. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం రెండు నెలల్లోని కృష్ణ, గోదావరి నది జలాల బోర్డులకు నదుల నిర్వహణను అప్పజెప్పిందని విమర్శించారు. తెలంగాణ రైతాంగం భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పార్టీ గళమెత్తిందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నదీ జలాల పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు నల్గొండ జిల్లా(Nalgonda District)లో బహిరంగసభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ బహిరంగసభకు భయపడిన కాంగ్రెస్ ప్రభుత్వం తోకముడిచిందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వం అబద్ధాలను ప్రచారం చేసిందని, కృష్ణా నది కింద ఉన్న ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీ(KRMB)కి అప్పగించడం మంచిది కాదని, దానివల్ల తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు. కరెంటుకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)బీఆర్‌ఎస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనిపించడం లేదని విమర్శించారు. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరం బీఆర్ఎస్‌పై ఉందన్నారు. కేసీఆర్‌(kcr) తెలంగాణ ప్రజలకు నది జలాలపై, వాటిని కేంద్రానికి అప్పజెప్పితే వచ్చే నష్టాలపై సభలో వివరిస్తారన్నారు. తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని ఎట్టి పరిస్థితులలో అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. ఈ రోజు ప్రారంభమైన జల ఉద్యమం మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో దీనిని మరింత ఉధృతం చేస్తామన్నారు.

read also : Shamirpet MRO Bribe Case : హైదరాబాద్ లో మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది ..