TS : ఐటీ రంగ వృద్ధికి రాజీవ్‌ గాంధీ బాటలు వేశారు: సీఎం రెవంత్‌ రెడ్డి

  • Written By:
  • Publish Date - May 21, 2024 / 01:56 PM IST

Rajiv Gandhi Death Anniversary: దివంగత కాంగ్రెస్‌ నేత, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 33వ వర్థంతి ఈరోజు ఈక్రమంలోనే నగరంలోని సోమాజీగూడ(Somajiguda)లో రాజీవ్‌ గాంధీ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి)CM Revanth Reddy) ఆయన విగ్రహానికి నివాళి(Tribute) ఆర్పించారు. దేశ ప్రధానిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని సీఎం రేవంత్‌ రెడ్డి కొనియాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ, పార్టీ రాష్ట్ర వ్యవహవారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఖమ్మం జిల్లా కూసుమంచిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీవ్‌ గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read Also: Jaya Badiga: హైద‌రాబాద్‌లో చ‌దివి.. అమెరికాలో కీల‌క ప‌ద‌వి, ఎవ‌రీ జ‌య బాదిగ‌..?

మరోవైపు ఈ మధ్యాహ్నం హైదరాబాద్ లోని బషీర్బాగ్లో పరిశ్రమల భవన్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. పరిశ్రమలపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పరిశ్రమలపై నేతలతో చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం తిరుపతికి పయనం కానున్నారు.