AP-TS : తెలుగు రాష్ట్రాల్లో సెమీ ఫైన‌ల్! చంద్ర‌బాబు, రేవంత్ గ్రాఫ్ కు `MLC` ప‌రీక్ష‌!

మినీ సంగ్రామాన్ని త‌ల‌పించేలా తెలుగు రాష్ట్రాల్లో (AP-TS)ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.

  • Written By:
  • Updated On - February 9, 2023 / 02:37 PM IST

మినీ సంగ్రామాన్ని త‌ల‌పించేలా తెలుగు రాష్ట్రాల్లో (AP-TS) ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఆయా పార్టీల బ‌లాబ‌లాల‌తో పాటు ఓట‌ర్ల నాడిని(Voter) ప‌ట్టేసే ఎన్నిక‌లుగా భావించొచ్చు. అధికార ప‌క్షాల మీద ప‌లు ఆరోప‌ణ‌లు గుప్పిస్తోన్న ప్ర‌తిప‌క్షాల‌కు ఈ ఎన్నిక‌లు కీల‌కం. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు స‌మీప భ‌విష్య‌త్ లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌లను నిర్దేశించ‌నున్నాయ‌ని భావించాలి.

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు(AP-TS) 

ఓట‌రు(Voter) నాడిని స్ప‌ష్టం చేసేలా ఈ ఎన్నిక‌ల‌కు ఉండ‌బోతున్నాయి. ప్ర‌త్యేకించి ఏపీ రాజ‌కీయాన్ని ఈ ఎన్నిక‌లు మలుపు తిప్ప‌నున్నాయి. ఆ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఈ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఉద్యోగులు, నిరుద్యోగులు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉన్నార‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీల న‌మ్మ‌కం. మూడు ప‌ట్ట‌భ‌ద్రులు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వాటి ద్వారా ఓట‌ర్ల నాడిని ప‌ట్టేయ‌డానికి అవ‌కాశం ఉంది. స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ స్థానాలు ఎనిమిది చోట్ల జ‌రుగుతున్న‌ప్ప‌టికీ, అక్క‌డ అధికార పార్టీ హ‌వా ఉండే అవ‌కాశం ఉంది.

రాయ‌ల‌సీమ , ఉత్త‌రాంధ్ర ఓట‌ర్ల నాడి(Voter)

రాయ‌ల‌సీమ , ఉత్త‌రాంధ్ర ఓట‌ర్ల నాడి(Voter) వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలా ఉంటుంది? అనేది స‌ర్వ‌త్రా వినిపిస్తుంది. ఇప్పుడు జ‌రిగే ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఆ రెండు ప్రాంతాల్లో జ‌ర‌గ‌బోతున్నాయి. అంతేకాదు, ఉపాధ్యాయ‌, ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాలు అక్క‌డే ఉన్నాయి. ఫ‌లితంగా యువ‌త‌, ఉద్యోగుల అభిప్రాయం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మీద ఎలా ఉంది? అనేది తేల‌బోతుంది. ఇప్ప‌టికే చంద్ర‌బాబునాయుడు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల‌ను కైవ‌సం చేసుకునేలా ప్లాన్ చేశారు. రెండు నెల‌ల క్రిత‌మే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం ద్వారా టీడీపీ ప్ర‌చారంలో దూసుకు వెళుతోంది. ఉపాధ్యాయులు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మీద క‌న్నేర్ర చేశారు. ఉద్యో్గులు, ఉపాధ్యాయులు సీపీఎస్ కోసం గ‌త కొంత కాలంగా ఉద్య‌మిస్తున్నారు. కానీ, రాష్ట్ర ప్ర‌భుత్వం పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. పైగా ఉపాధ్యాయుల‌కు ఇటీవ‌ల ఫేస్ రిక‌గ్నైజేష‌న్ ప‌ద్ధ‌తిని పెట్ట‌డం ద్వారా టైమ్ కు పాఠ‌శాల‌ల‌కు వ‌చ్చేలా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేశారు. అంతేకాదు, ఎన్నిక‌ల విధుల‌ను నుంచి వాళ్ల‌ను తొల‌గిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ అంశాలు ఉపాధ్యాయ‌, ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల మీద ప‌డ‌నుంది.

Also Read : Jagan-KCR : మోసం గురూ..! అన్న‌ద‌మ్ముల రాజ‌కీయ చ‌తుర‌త‌!!

ఇక తెలంగాణ రాష్ట్రంలో ఒక చోట మాత్ర‌మే ఎమ్మెల్సీ ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అయితే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత జిల్లా మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌, రంగారెడ్డి ప‌రిధిలోని ఉపాధ్యా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కావ‌డం విశేషం. అక్క‌డ కాంగ్రెస్ క‌నీసం రెండో స్థానంలో కూడా ఉండ‌క‌పోతే రేవంత్ రెడ్డి గ్రాఫ్ మ‌రింత ప‌డే ప్ర‌మాదం ఉంది. ప్ర‌స్తుతం పాద‌యాత్ర చేస్తోన్న రేవంత్ రెడ్డికి ఈ ఎన్నిక ప్ర‌తిష్టాత్మ‌కం కానుంది. ఆయ‌న పీసీసీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌రువాత హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు చేదు అనుభ‌వం మిగిలింది. అంతేకాదు, ఆయ‌న వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న‌ప్పుడు. జ‌రిగిన హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను చేజారుకున్నారు. ఇప్పుడు మ‌హ‌బూబ్ న‌గ‌ర్, రంగారెడ్డి ప‌రిధిలోని ఉపాధ్యా ఎమ్మెల్సీ ఎన్నిక రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వానికి ఒక స‌వాల్‌.

15 స్థానాల‌కు  ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్

తెలుగు రాష్ట్రాల్లో(AP-TS) త్వరలో ఖాళీ కాబోతున్న 6 స్థానాలతో పాటు ఇప్పటికే ఖాళీ అయిన 9 స్థానాలు మొత్తంగా 15 స్థానాల‌కు గురువారం ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మార్చి 13న ఈ స్థానాలకు పోలింగ్ నిర్వహించి, మార్చి 16న ఫ‌లితాల‌ను విడుదల చేయాల‌ని ఈసీ షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో 8 స్థానిక సంస్థలు, 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ ప‌రిధిలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గం, రాయ‌ల‌సీమ ప‌రిధిలోని కడప, అనంతపురం, కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గం, ఉత్త‌రాంధ్ర ప‌రిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నిక‌లు రాజ‌కీయ పార్టీల‌కు కీల‌కం. గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ ప‌రిధిలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ నియోజక వర్గం, రాయ‌ల‌సీమ ప‌రిధిలోని కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ నియోజక వర్గం ఎన్నిక‌లు ఉపాధ్యాయులు, ఉద్యోగుల‌కు స‌వాల్ గా నిలువ‌నున్నాయి. ఒక వేళ రెండు ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌ద్ధ‌తు ఇచ్చే సంఘాలు గెలిస్తే ఉద్యోగుల డిమాండ్లు వెన‌క్కు వెళ్ల‌నున్నాయి.

Also Read : Jagan Employees : ప్ర‌భుత్వంపై ఏపీ ఉద్యోగుల `డెడ్ లైన్ `కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెక్

గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ‌, రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప‌రిధిలోని ప‌ట్టభ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌లు రాజ‌కీయ పార్టీల‌కు స‌వాల్‌. ఈ ఫ‌లితాల ఆధారంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముందస్తుకు వెళ‌తారా? లేదా? అనేది తేల‌నుంది. ఎందుకంటే, ప్ర‌స్తుతం యూత్, నిరుద్యోగులు జ‌గ‌న్మోహన్ రెడ్డి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉన్నార‌ని టీడీపీ, జ‌న‌సేన, బీజేపీ ప్ర‌చారం చేస్తున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో యూత్ ప్రాధాన పాత్ర పోషించ‌నున్నారు. పైగా సాధార‌ణ ఎన్నిక‌ల‌కు భిన్నంగా జ‌రిగే ఎన్నిక‌లు. దాదాపు సామ‌దాన‌దండోపాయాలు ఉండే అవ‌కాశం ఉండ‌దు. క్లియ‌ర్ గా ఓట‌ర్ల నాడి(Voter( తెలిసే అవ‌కాశం ఉంది. దీంతో రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జ‌లు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌న్న దానికి ఈ ఎన్నిక‌ల‌ను బెంచ్ మార్కు గా తీసుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. అందుకే, ఈ ఎన్నిక‌ల‌ను మినీ సంగ్రామంగా ప‌రిగ‌ణించాలి.