AP & TG Election Results : ఎన్నికల్లో ఘోర ఓటమి ఫై వైసీపీ స్పందన

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ & తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చే సమయం రానేవచ్చింది

  • Written By:
  • Updated On - June 4, 2024 / 10:34 PM IST

Updated – 06:00 PM :

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి స్పందించారు. ‘రాష్ట్ర ప్రజలు కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించాల్సిందే. ఓటమికి కారణాలను సమీక్షించుకుంటాం. ఎక్కడ పొరపాట్లు జరిగాయి? ఎలా సరిదిద్దుకోవాలి? ప్రజలకు నచ్చని పనులు ఏం చేశాం? అనేది సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తాం’ అని పేర్కొన్నారు.

Updated – 05:55 PM :

కడప లోక్‌సభ వైసీపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి 69,050 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం
నరసాపురం లోక్‌సభ BJP అభ్యర్థి శ్రీనివాసవర్మ 2.76 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం
శ్రీకాకుళం లోక్‌సభ TDP అభ్యర్థి రామ్మోహన్‌నాయుడు 3.07 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం
రాయచోటిలో TDP అభ్యర్థి రాంప్రసాద్‌రెడ్డి 2,471 ఓట్ల ఆధిక్యంతో గెలుపు
గురజాలలో TDP అభ్యర్థి యరపతినేని 29,100 ఓట్ల ఆధిక్యంతో విజయం
పాతపట్నం TDP అభ్యర్థి మామిడి గోవిందరావు 24,350 ఓట్ల ఆధిక్యంతో విజయం
ఒంగోలు టిడిపి అభ్యర్థి దామచర్ల జనార్దన్ 34,100 ఓట్ల మెజార్టీతో విజయం

Updated – 05:50 PM :

9 ఉమ్మడి జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ
విజయనగరం, శ్రీకాకుళం, ఉమ్మడి గోదావరి జిల్లాలను స్వీప్‌ చేసిన కూటమి
కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాలను స్వీప్‌ చేసిన కూటమి
జగన్‌, పెద్దిరెడ్డి మినహా ఓడిన మంత్రులు, మాజీ మంత్రులు

Updated – 06:00 PM :

గన్నవరం నుంచి కుటుంబంతో హైదరాబాద్ బయలుదేరిన వంశీ

Updated – 05:40 PM :

Updated – 04:40 PM :

చీపురుపల్లి లో మంత్రి బొత్స ఓటమి చెందారు. బొత్స ఫై 11 , 527 ఓట్ల ఆధిక్యంతో టిడిపి అభ్యర్థి కళా వెంకట్రావు విజయం సాధించారు.

Updated – 04:35 PM :

కేవలం 25 ఓట్లతో టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్. రాజు విజయం సాధించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్. రాజు తన సమీప ప్రత్యర్థి ఈర లక్కప్పపై 25 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 78347 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి ఈర లక్కప్పకి 78,322 ఓట్లు నమోదయ్యాయి.
రాష్ట్రంలో అతి తక్కువ మెజార్టీతో ఇదే కావడం విశేషం.

Updated – 04:30 PM :

తెలంగాణ లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఒక్క స్థానం లో కూడా బిఆర్ఎస్ సాధించలేకపోయింది. బిజెపి – కాంగ్రెస్ పార్టీలు చెరో 8 స్థానాల్లో విజయం సాధించగా..AMIM హైదరాబాద్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఫలితాలతో బిఆర్ఎస్ శ్రేణులు మరింత నిరాశ లో ఉన్నారు. ఈ ఫలితాలపై కేటీఆర్ స్పందించారు.

‘TRS స్థాపించిన 24 ఏళ్లలో విజయాలు, ఎదురుదెబ్బలు అన్నీ చూశాం. తెలంగాణను సాధించడమే మా అతిపెద్ద విజయం. 20145 63/119, 2018 88/119 సాధించాం. ప్రస్తుతం 39 స్థానాల్లో గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. నేటి ఎన్నికల ఎదురుదెబ్బ కచ్చితంగా చాలా నిరాశపరిచింది. కానీ మేము శ్రమిస్తూనే ఉంటాం. మళ్లీ గట్టిగా తిరిగొస్తాం’ అని ట్వీట్ చేశారు.

ఇప్పటివరకు గెలిచిన కూటమి అభ్యర్థుల లిస్ట్..

ఎలమంచిలిలో జనసేన అభ్యర్థి విజయ్‌కుమార్‌ విజయం
గజపతినగరంలో టిడిపి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు 24,302 ఓట్ల ఆధిక్యంతో గెలుపు
కడపలో టిడిపి అభ్యర్థి మాధవిరెడ్డి 22,852 ఓట్ల ఆధిక్యంతో విజయం

హిందూపురం నుంచి బాలకృష్ణ హ్యాట్రిక్‌ విజయం
తణుకులో టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ 71 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం
తాడిపత్రిలో టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి 29 వేల ఓట్లతో విజయం
బొబ్బిలి టీడీపీ అభ్యర్థి బేబీనాయన 45,200 ఓట్ల ఆధిక్యంతో విజయం
ఉంగుటూరులో జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు 44,107 ఓట్ల మెజారిటీతో గెలుపు
నరసాపురంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయికర్‌ 49,738 మెజారిటీతో విజయం
మాచర్లలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి 32,324 ఓట్ల తేడాతో విజయం
తణుకులో మంత్రి కారుమూరిపై గెలిచిన ఆరిమిల్లి రాధాకృష్ణ

తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ విజయం
గంగాధరనెల్లూరు అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థి థామస్‌ విజయం
శ్రీకాకుళం అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థి గొండు శంకర్‌ విజయం
ఆమదాలవలస అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్‌ విజయం
చిలకలూరిపేటలో టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు విజయం

రాజానగరంలో జనసేన అభ్యర్థి బత్తుల రామకృష్ణ 34,049 ఓట్ల ఆధిక్యంతో విజయం
మైదుకూరులో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ 20,937 ఓట్ల ఆధిక్యంతో విజయం
తాడేపల్లిగూడెంలో 66,039 ఓట్లతో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ విజయం
పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల 69 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం
పార్వతీపురంలో టీడీపీ అభ్యర్థి బోనెల విజయ్‌ 23,650 ఓట్ల ఆధిక్యంతో విజయం
బాపట్లలో టీడీపీ అభ్యర్థి వేగేశ్న నరేంద్రవర్మ 26,800 ఓట్ల ఆధిక్యంతో విజయం

ఉండిలో టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు 56,777 ఓట్ల ఆధిక్యంతో విజయం
రాజమండ్రి గ్రామీణంలో బుచ్చయ్యచౌదరి 64,090 ఓట్ల ఆధిక్యంతో విజయం
డోన్‌ టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి 6450 ఓట్ల ఆధిక్యంతో విజయం
పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌ 70 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం
మాచర్లలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి విజయం
రాజమండ్రి గ్రామీణంలో బుచ్చయ్యచౌదరి ఘనవిజయం

రాజమహేంద్రవరం నగరంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు విజయం
కొవ్వూరులో టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం
గాజువాకలో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విజయం
పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల 69 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం
అనపర్తిలో భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం
ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ విజయం
ప్రొద్దుటూరులో టీడీపీ అభ్యర్థి వరదరాజుల రెడ్డి విజయం
ప్రత్తిపాడులో టీడీపీ అభ్యర్థి సత్యప్రభ విజయం
రాజానగరంలో జనసేన అభ్యర్థి బత్తుల రామకృష్ణ విజయం

తణుకులో టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ విజయం
చింతలపూడిలో టీడీపీ అభ్యర్థి రోషన్‌ కుమార్‌ విజయం
భీమవరంలో జనసేన అభ్యర్థి రామాంజనేయులు విజయం
ఆచంటలో టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ విజయం
పార్వతీపురంలో టీడీపీ అభ్యర్థి బోనెల విజయ్‌ విజయం
రాజమండ్రి గ్రామీణంలో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్యచౌదరి ఘనవిజయం
రాజమహేంద్రవరం నగరంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు విజయం
కొవ్వూరులో టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం

గాజువాకలో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విజయం
పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు విజయం
అనపర్తిలో బిజెపి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం
అనపర్తిలో బిజెపి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం
రాజమండ్రి సిటీ బుచ్చయ్యచౌదరి ఘనవిజయం
రాజమహేంద్రవరం నగరంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు విజయం
రాజమహేంద్రవరం నగరంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు విజయం
55 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన ఆదిరెడ్డి వాసు

Updated – 04:10 PM :

పిఠాపురం బరిలో 70 వేల మెజార్టీ తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. ఈ క్రమంలో పవన్ సక్సెస్ సంబరాలను సతీమణి , కుమారుడు అఖీరా తో కలిసి జరుపుకున్నారు.

Updated – 03:45 PM :

పులివెందులో జగన్ 59 వేల మెజార్టీ తో విజయం సాధించారు.

Updated – 03:25 PM :

గుడివాడ లో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఓటమి..నాని ఫై రాము 51 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

Updated – 03:25 PM :

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు వీరే..

మహబూబాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కవితపై 3,29,717 ఓట్ల తేడాతో గెలుపొందారు.

వరంగల్ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ ఫై 2,05,183 ఓట్ల తేడాతో గెలుపొందారు.

జహీరాబాద్లో కాంగ్రెస్అభ్యర్థి సురేశ్ షెట్కార్ 45,962 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ బీజేపీ నుంచి బీబీ పాటిల్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు 5.5 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి సైదిరెడ్డి పోటీ చేశారు.

ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఐదోసారి అసదుద్దీన్ ఒవైసీ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి మాధవీలతపై 3,15,811 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఇక్కడ ఆయనకు 1.95 లక్షల మెజార్టీ లభించింది. బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, BRS నుంచి క్యామ మల్లేశ్ పోటీ చేశారు.

నిజామాబాద్లో ధర్మపురి అర్వింద్ మరోసారి విజయం సాధించారు. సిట్టింగ్ ఎంపీ బీజేపీ తరఫున పోటీ చేసిన అర్వింద్ 1,22,711 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి తాటిపర్తి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్థన్ పోటీ చేశారు.

సికింద్రాబాద్లో బీజేపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి గెలుపొందారు. ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుపై 65వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.

చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి విజయం సాధించారు. ఆయనకు 1.38 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీ లభించింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, BRS నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేశారు.

మలక్జ్ గిరి బరిలో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ విజయం సాధించారు.

Updated – 03:13 PM :

హిందూపురంలో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి ఫై 31, 606 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

Updated – 02:50 PM :

Updated – 02:45 PM :

పిఠాపురం లో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ తో విజయం సాధించడం పట్ల అయన భార్య Anna Lezhneva తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. పెద్ద ఎత్తున అభిమానులు ఇంటివద్దకు రాగా..వారికీ అభివాదం చేస్తూ తన సంతోషాన్ని పంచుకుంది. అలాగే కుమారుడు అకిరా కూడా తన సంతోషాన్ని పంచుకున్నాడు.

Updated – 02:35 PM :

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాజానగరంలో జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ.. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజాపై ఘన విజయం సాధించారు.

Updated – 02:30 PM :

చింతలపూడి, బాపట్లలో టీడీపీ విజయం

ఏలూరు జిల్లా చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థి సొంగా రోషన్, సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కంభం విజయరాజుపై 26 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అటు, బాపట్లలో వైసీపీ అభ్యర్థి కోన రఘుపతిపై.. టీడీపీ అభ్యర్థి వేగేశ్న నరేంద్ర కుమార్ గెలుపొందారు.

Updated – 02:20 PM :

ఉండి నియోజకవర్గం నుంచి రఘురామ కృష్ణంరాజు విజయం

Updated – 02:15 PM :

కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించారు.

Sriganesh

Updated – 02:00 PM :

ఏపీ ఎన్నికల్లో కూటమి సునామి సృష్టించింది..జనసేన బరిలో నిల్చున్న 21 స్థానాల్లో 20 స్థానాల్లో గెలిచే విధంగా ఉంది..ఇక వైసీపీ కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించే అవకాశం కూడా లేకుండా పోతుంది. 15 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఇది పవన్ కళ్యాణ్ ముందే ఉహించాడు. కొద్దీ రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ వైసీపీ గత ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచింది..ఈసారి 15 స్థానాలే రావొచ్చు..అని అన్నారు. ఇప్పుడు అదే విషయాన్నీ జనసేన శ్రేణులు గుర్తు చేస్తూ ఆ వీడియో ను షేర్ చేస్తున్నారు.

Updated – 01:49 PM :

దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ తో విజయం సాధించారు. 14 రౌండ్స్ లలో 61 వేల మెజార్టీ తో పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా మరికొన్ని రౌండ్స్ ఉండడం తో లక్ష వరకు మెజార్టీ రావొచ్చని అంచనా.

Pawan Win

Updated – 01:45 PM :

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రికార్డు సృష్టించారు. టీడీపీ దశాబ్దాలుగా గెలవని మంగళగిరి సీటులో ఆ పార్టీ జెండాను ఎగరేసి చరిత్ర తిరగరాశారు. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ గెలిచింది రెండు సార్లే. 1985లో చివరిగా గెలిచింది. 2019లో ఓడినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండటం, సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆయనపై ప్రజల్లో సానుకూలతను విపరీతంగా పెంచి..ఈరోజు ఆయనకు విజయాన్ని అందించాయి.

Updated – 01:45 PM :

జూన్ 09 న అమరావతి లో సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం.

Updated – 01:42 PM :

తెలంగాణ లోక్ సభ ఫలితాల్లో అనూహ్య పరిణామం

Updated – 01:40 PM :

బీజేపీ – కాంగ్రెస్ చెరో 8 స్థానాల్లో ఆధిక్యం..హైదరాబాద్ స్థానంలో AMIM ఆధిక్యం ..ఎక్కడ ప్రభావం చూపని బిఆర్ఎస్

Updated – 01:35 PM :

చెప్పాడు… చేసాడు..మనల్ని ఎవడ్రా ఆపేది!!!

Updated – 01:35 PM :

ఏపీలో మొదలైన రంగులు..గ్రామపంచాయితీలకు ఉన్న బ్లూ కలర్ ను తొలగించి యెల్లో కలర్ వేస్తున్న తెలుగు తమ్ముళ్లు..

Updated – 1:30 PM :

కొవ్వూరు టిడిపి అభ్యర్థి వెంకటేశ్వరరావు విజయం

Updated – 1:30 PM :

అనపర్తి లో బిజెపి విజయం

Updated – 1:30 PM :

భీమవరంలో జనసేన అభ్యర్థి రామాంజనేయులు గెలుపు
Updated – 01:15 PM :

Updated – 01:25 PM :

ఏపీలో మొదలైన రంగులు..గ్రామపంచాయితీలకు ఉన్న బ్లూ కలర్ ను తొలగించి యెల్లో కలర్ వేస్తున్న తెలుగు తమ్ముళ్లు..

Updated – 01:00 PM :

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి దిశగా వైసీపీ సాగుతోంది. దీంతో సీఎం జగన్ కాసేపట్లో తన పదవికి రాజీనామా చేయనున్నారు. గవర్నర్ జస్టిస్ నజీరు తన రాజీనామా లేఖను పంపనున్నారు.

Jagan Resign

Updated – 12:55 PM :

175 ..గెలుస్తాం అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ..ప్రస్తుతం 17 స్థానాల్లో లీడ్ లో ఉంది.

Updated – 12:55 PM :

ఏపీలో ఘర్షణలు మొదలయాయ్యి. పోలింగ్ రోజు ఎలాగైతే దాడులు చేసారో..ఇప్పుడు మరోసారి ఫలితాల రోజున ఘర్షణలు మొదలుపెట్టారు. ద్వారకాతిరుమల, నంద్యాల , ఆళ్లగడ్డ లలో వైసీపీ – టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది.

Updated – 12:50 PM :

ఏపీలో వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆరా మస్తాన్ ఫై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే..కూటమి శ్రేణులు సెటైర్లు వేస్తున్నారు. ఫలితాల ఆరంభంలో ఓ ఛానల్ లైవ్‌లో పాల్గొన్న ఆరా సర్వే సారథి ఉన్నట్లుండి కన్పించకుండాపోయారు. దీంతో సమాధానం చెప్పుకోలేకనే బయటకు వెళ్లిపోయినట్లు టీడీపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి. వైసీపీకి 94 నుంచి 104 సీట్లు వస్తాయని మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ ఇస్తే ప్రస్తుతం వైసీపీ 14 సీట్లలోనే ఆధిక్యంలో ఉందంటూ..కామెంట్స్ చేస్తున్నారు.

Updated – 12:40 PM :

రాజమండ్రి సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గెలుపు

Updated – 12:37 PM :

పాలకొల్లులో నిమ్మల రామానాయుడు గెలుపు

Updated – 12:35 PM :

పిఠాపురంలో 11 రౌండ్స్ పూర్తి..60 వేల మెజార్టీ

Updated – 12:30 PM :

తాడేపల్లి వైసీపీ ఆఫీస్ వెలవెల

Updated – 12:25 PM :

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు కంగ్రాట్స్ – క్రికెటర్ హనుమా విహారి. ‘ఘన విజయం దిశగా సాగుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్కు అభినందనలు’ అని ఆయన ట్వీట్ చేశారు. ‘కర్మ ఎప్పుడూ విఫలం కాదు’ అంటూ వైసీపీని ఉద్దేశించి కామెంట్ చేశారు.

Updated – 12:20 PM : ఈ విజయానికి మీరు అర్హులు అన్నయ్య – నితిన్. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందనుండటంతో టాలీవుడ్ హీరో నితిన్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ ఎన్నికల్లో కూటమిని గెలిపించడం కోసం మీరు చేసిన కృషికి నేను ఓ అభిమానిగా, సోదరుడిగా ఎంతో సంతోషిస్తున్నా. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా. ఈ విజయం కోసం మీరెంతో పోరాడారు. ఈ విజయానికి మీరు అర్హులు. మీరెప్పటికీ మా పవర్ స్టారే.. మీకిప్పుడు మరింత పవర్ లభించనుంది’ అని ట్వీట్ చేశారు.

Updated – 11:49 AM :

వైసీపీ ని దెబ్బ తీసిన పవన్ కళ్యాణ్ వ్యూహం..ఈరోజు వైసీపీ ఈ స్థాయికి దిగజారడానికి కారణం పవన్ కల్యాణే అని వైసీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ను రెచ్చిగొట్టి తప్పు చేశామని బాధపడుతున్న వైసీపీ.

Updated – 11:46 AM :

పిఠాపురంలో 5 రౌండ్స్ పూర్తి…25 వేల ఓట్ల మెజార్టీ తో పవన్ కళ్యాణ్ ముందంజ

Updated – 11:45 AM :

ఏపీ ఎన్నికల్లో కూటమి ఖాతా తెరిచింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. 61వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచినట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్డీయే కూటమి 160 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.

Gorantla Butchaiah Chowdary

Updated – 11:25 AM : కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వెళ్ళిపోతున్న వైసిపి అభ్యర్థులు

Updated – 11:22 AM : ఎంపీ స్థానాల్లోనూ కూటమిదే హవా

Updated – 11:20 AM : ఎస్సీ , ఎస్టీ స్థానాలు టీడీపీ ఘనవిజయం

Updated – 11:15 AM : సంబరాల్లో కూటమి శ్రేణులు.. నిరాశలో వైసిపి శ్రేణులు

Updated – 11:12 AM : కూటమి సునామీలో కొట్టుకుపోయిన వైసిపి

Updated – 11:10 AM : రాయలసీమలోను ప్రభావం చూపని వైసిపి

Updated – 11:15 AM : చంద్రబాబు ను కలిసేందుకు పార్టీ ఆఫీస్ కు వచ్చిన డైరెక్టర్ బోయపాటి

Updated – 11:10 AM : కడప జిల్లాలో ఆరు స్థానాల్లో కూటమి మెజార్టీ

Updated – 11:08 AM :

జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పబోతున్నాడా..? అంటే అవుననే చెప్పాలి. ఏపీలో జరిగిన 175 అసెంబ్లీ స్థానాల్లో 153 స్థానాల్లో NDA కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు మరోసారి చక్రం తిప్పేలా కనిపిస్తున్నారు. బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ (272) సాధించకపోతే బాబు కీలకంగా మారుతారు. ఎందుకంటే 16 సీట్లతో ఇప్పుడు ఎన్డీయేలో టీడీపీ రెండో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించేలా ఉంది. ఢిల్లీలో మోదీ అధికారంలో ఉంటే ఏపీకి ప్రాధాన్యం ఇవ్వకతప్పదు.

Updated – 10:55 AM :

ఏపీలో NDA కూటమి జోరు కనపరుస్తుంది. 175 అసెంబ్లీ స్థానాల్లో 153 స్థానాల్లో NDA కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ 128, జనసేన 19, బీజేపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. వైసీపీ కేవలం 20 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. ఇక వైసీపీ కి కంచుకోటగా భావించే రాయలసీమలోను కూటమి విజయం వ్యపు పరుగులు పెడుతుంది. బద్వేల్, పులివెందుల, పత్తికొండ, ఆలూరు, గుంతకల్లు, జమ్మలమడుగు సహా కొన్ని చోట్ల మాత్రమే వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

Updated – 10:40 AM : పార్టీ కార్యాలయానికి చంద్రబాబు

Updated – 10:38 AM : ఆనందంలో కూటమి శ్రేణులు..నిరాశలో వైసీపీ శ్రేణులు

Updated – 10:36 AM : జగన్ మాటను నిలబెట్టిన ఏపీ ప్రజలు..మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయమన్న జగన్..మంచి జరగలేదనే ఓటు వేయలేదా..?

Updated – 10:35 AM : రాయలసీమలోను సైకిల్ జోరు

Updated – 10:30 AM : చంద్రబాబు నివాసం వద్ద విజయోత్సవ సంబరాలు

Updated – 10:30 AM : రాయలసీమలోను సైకిల్ జోరు

Updated – 10:25 AM : ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ క్లిన్ స్వీప్ చేసే విధంగా ముందంజ లో దూసుకెళ్తుండడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు మొదలుపెట్టారు. విజయవాడ లోని పార్టీ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated – 10:20 AM : కౌంటింగ్ కేంద్రాల నుండి వెళ్లిపోయిన కొడాలి నాని, వంశీ

Kodalinaniout

Updated – 10:07 AM : ఖమ్మంలో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి లక్ష ఓట్లతో ఆధిక్యం

Updated – 10:11 AM : ఆదిలాబాద్ లో బిజెపి అభ్యర్థి ముందంజ

Updated – 10:10 AM : కరీంనగర్లో బిజెపి అభ్యర్థి ముందంజ

Updated – 10:09 AM : నిజామాబాదులో బిజెపి అభ్యర్థి ముందంజ

Updated – 10:08 AM : మల్కాజిగిరిలో బిజెపి అభ్యర్థి ఈటెల ముందంజ

Updated – 10:07 AM : ఓటమి బాటలో వైసీపీ మంత్రులు

Updated – 10:06 AM : ఏపీలో NDA కూటమి జోరు

Updated – 10:06 AM : కర్నూల్ టిడిపి అభ్యర్థి టీజీ భరత్ ఆధిక్యం

Updated – 10:05 AM : పీలేరు టిడిపి అభ్యర్థి నల్లారి కిషోర్ లీడ్

Updated – 10:04 AM : పెందుర్తిలో జనసేన ముందంజ

Updated – 10:03 AM : శ్రీకాళహస్తి టిడిపి అభ్యర్థి ముందంజ

Updated – 10:02 AM : చీపురుపల్లి మంచి బొత్స వెనకంజ

Updated – 10:01 AM : పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి వెనుకంజ

Updated – 10:00 AM : తునిలో మంత్రి దాడిశెట్టి రాజా వెనకంజ

Updated – 09:53 AM : మంగళగిరి లో నారా లోకేష్ ఆధిక్యం

Updated – 09 :52 AM : కుప్పంలో చంద్రబాబు ఆధిక్యం

Updated – 09:52 AM : పులివెందుల సీఎం జగన్ ఆధిక్యం

Updated – 09:51 AM : శ్రీశైలంలో టిడిపి అభ్యర్థి ముందంజ

Updated – 09:51 AM : పోలవరంలో వైసిపి అభ్యర్థి ముందంజ

Updated – 09:50 AM : తెలంగాణ కంటోన్మెంట్ ఉప ఎన్నిక లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం

Updated – 09:44 AM : 101 స్థానాల్లో కూటమి ఆధిక్యం

Updated – 09 :42 AM : వైసీపీ మంత్రులంతా వెనుకంజ

Updated – 09:33 AM : అనకాపల్లిలో సీఎం రమేష్ ఆధిక్యం

పొన్నూరులో టిడిపి అభ్యర్థి ఆధిక్యం
అనకాపల్లిలో సీఎం రమేష్ ఆధిక్యం
నెల్లూరులో టిడిపి అభ్యర్థి థామస్ ఆధిక్యం
కిరణ్ కుమార్ రెడ్డి ఆధిక్యం
నంద్యాలలో టిడిపి పార్టీ షారుక్ ఆధిక్యం
పెనుగొండలో టిడిపి అభ్యర్థి సబితమ్మ ఆధిక్యం
దెందులూరు లో టిడిపి అభ్యర్థి చింతమనేని ఆధిక్యం
పాలకొల్లు టిడిపి పార్టీ నిర్మల రామానాయుడు లీడ్

Updated – 09:23 AM : ఏడు స్థానాల్లో జనసేన ఆధిక్యం

Updated – 09:22 AM : పొన్నూరులో టిడిపి అభ్యర్థి ముందంజ

Updated – 09:22 AM : నెల్లూరు సిటీలో టిడిపి అభ్యర్థి నారాయణ ముందంజ

Updated – 09:21 AM : శ్రీశైలంలో టిడిపి అభ్యర్థి ముందంజ

Updated – 09:20 AM : మాచర్లలో పిన్నెల్లి వెనుకంజ

Updated – 09:15 AM : పులివెందులలో జగన్ ఆధిక్యం

Updated – 09:15 AM : నగరి లో రోజా వెనకడుగు

Updated – 09:13 AM : గుడివాడ లో టీడీపీ ఆధిక్యం

Updated – 09:13 AM : 5 వేల ఆదిక్యంలో పవన్ కళ్యాణ్

Updated – 09:13 AM : బొబ్బల్లో టిడిపి అభ్యర్థి బేబీ నాయన ముందంజ

Updated – 09:13 AM : గజపతినగరం టిడిపి వద్ద కేక్ శ్రీనివాస్ లీడ్

Updated – 09:13 AM : విజయవాడ టిడిపి ఎంపీ అభ్యర్థి చిన్ని ఆధిక్యం

Updated – 09:13 AM: నరసరావుపేట టిడిపి అభ్యర్థి కృష్ణదేవరాల

Updated – 09:13 AM : కడప లో షర్మిల ఆధిక్యం

Updated – 8 :56 AM : అదిలాబాదులో బిజెపి అభ్యర్థి గుండు నగేష్ ముందంజ

Updated – 8 :55 AM : ఖమ్మం లోక్ సభలో కాంగ్రెస్ ఆధిక్యం

Updated – 8 :55 AM : హైదరాబాద్లో ఎంఐఎం అభ్యర్థి ఓవైసీ ఆధిక్యం

Updated – 8 :55 AM : సికింద్రాబాద్లో బిజెపి ముందంజ

Updated – 8 :54 AM : తెనాలి లో నాదెండ్ల మనోహర్ ముందంజ

Updated – 8 :53 AM : రాయలసీమలో టీడీపి ఆధిక్యం

Updated – 8 :52 AM : 11 స్థానాల్లో టిడిపి ఆధిక్యం

Updated – 8 :52 AM : నెల్లూరు సిటీలో టిడిపి ఆధిక్యం

Updated – 8 :52 AM : పోస్టల్ బ్యాలెట్ లో పవన్ కళ్యాణ్ కి ఆదిక్యం

Updated – 8 :52 AM : నంద్యాలలో టిడిపి అభ్యర్థి బైరెడ్డి శబరి ఆదిక్యం

Updated – 8 :52 AM : గజపతినగరంలో టిడిపి అభ్యర్థి ఆధిక్యం
Updated – 8 :50 AM : ఇంతవరకు ఖాతా తెరవని వైసీపీ

Updated – 8 :46 AM : పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ముందంజ

Updated – 8 :40 AM : తెలంగాణ లోక్ సభలో బిజెపి ముందంజ

Updated – 8 :40 AM : ఏపీలో టీడీపి ముందంజ

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చే సమయం రానేవచ్చింది. మరికాసేపట్లో రాష్ట్రంలో ఏ పార్టీ విజయం సాదించబోతుంది..? ఎవరు అధికారం దక్కించుకోబోతున్నారు..? ఎవరు సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు..? ఎవరికీ ఎంత మెజార్టీ రాబోతుంది..? ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది..? సైకిల్ జోరా…? ఫ్యాన్ గాలి స్పీడా..? అనేది తెలియబోతుంది.

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామాల్లో మహిళలు, పురుషులు, వృద్ధులే కాదు విదేశాల్లో ఉన్న NRI లు మండు ఎండలను సైతం లెక్క చేయకుండా వచ్చి ఓటు వేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భారీగా పోలింగ్ శాతం నమోదు అయింది. దీంతో పోలింగ్ శాతం పెరగడం ఏ పార్టీకి కలిసొస్తుందో అనే ఆసక్తి నెలకొంది.

రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సీట్ల కోసం 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఏపీలో మొత్తం 3.33 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించారు. 4.61 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారు. 26,473 మంది ఓటర్లు హోమ్‌ ఓటింగ్‌ విధానం ద్వారా ఓటు వేశారు. మరో 26,721 మంది సర్వీసు ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్‌ విధానంలో ఓటు వేయడం జరిగింది. పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుళ్లు ఏర్పాటు చేశారు.