Site icon HashtagU Telugu

AP Minister Botsa: చూచి రాతలు, కుంభకోణాలు.. తెలంగాణ విద్యావ్యవస్థపై మంత్రి బొత్స కామెంట్స్

Botsa Satyanarayana

Botsa Satyanarayana

ఏపీ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. మాటల తూటాలు, ఆరోపణలకు ప్రతి ఆరోపణలు, ఘాటు పదజాలంతో విమర్శలు చేసుకుంటున్నారు రాజకీయ నేతలు. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వాలంటీర్ వ్యవస్థను తప్పుపడుతూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పవన్ పై వైసీపీ నేతలు విరుచుకుపడుతూనే ఉన్నారు. తాజాగా మంత్రి బోత్స కూడా రియాక్ట్ అయ్యారు. అయితే పవన్ ను టార్గెట్ చేయబోయి తెలంగాణ విద్యావ్యవస్థ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

విజయవాడలో నేడు ట్రిపుల్ ఐటీ ప్రవేశ ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడారు. ఏపీ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్‌ తెలంగాణతో పోల్చి చూడటం సరికాదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కడంతా చూచి రాతలు, కుంభకోణాలు.. రోజూ మనం చూస్తునే ఉన్నాంగా.. అని అన్నారాయన. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణది. మన విధానం మనది.. మన ఆలోచనలు మనవి.. అని వ్యాఖ్యానించారు.

అసలా..వ్యవస్థ ఎలా పుట్టిందో ముందు.. పవన్‌ తెలుసుకోవాలి అని మంత్రి అన్నారు. వాలంటీర్లపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై బొత్స స్పందించారు. అతని వ్యాఖ్యలపై ఎవరూ పట్టించుకోకుంటేనే మంచిదని… పొద్దు పొద్దున్నే మాకెందుకీ రచ్చ?అంటూ అసహనం వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా పుట్టిందో ముందు పవన్ తెలుసుకోవాలని బొత్స హితవుపలికారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న వాలంటీర్ వ్యవస్థపై దుర్బుద్ధితో విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం బోత్స కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై తెలంగాణ మంత్రులు ఏవిధంగా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

Also Read: Tirumala: తిరుమలలో చిరుతపులి కలకలం.. భయాందోళనలో భక్తులు!