CBI – ED: 2 స్టేట్స్ సీఎంల ఇంటి గుట్టు ! సీబీఐ, ఈడీ ఉచ్చులో అవినాష్, కవిత!!

తెలుగు రాష్ట్రాల సీఎం లు కేసీఆర్, జగ్మోహన్ రెడ్డి ఇంటి గుట్టు బయట పడింది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో దోబూచులాడుతుంది.

  • Written By:
  • Updated On - March 10, 2023 / 11:51 AM IST

తెలుగు రాష్ట్రాల సీఎం లు కేసీఆర్, జగ్మోహన్ రెడ్డి ఇంటి గుట్టు బయట పడింది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో దోబూచులాడుతుంది. సేమ్ టు సేమ్ కవిత అరెస్ట్ కేసీఆర్ కుటుంబాన్ని కలవరపెడుతోంది. ఇంతకాలం ఎదురులేకుండా రాజ్యాన్ని ఏలిన ఈ రెండు కుటుంబాల అసలు స్వరూపం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అరెస్ట్ ల నుంచి తప్పుకోవడానికి న్యాయస్థానాల మెట్లు తొక్కారు. ఇవే న్యాయస్థానాలపై రెచ్చిపోయిన ఫ్యామిలీలు కూడా ఇవే. ఇప్పుడు అరెస్ట్ కత్తి మెడపై వేలాడుతుంది. CBI అవినాష్ ను అరెస్ట్ చేయడానికి సిద్ధం అయింది. మాజీ మంత్రి వివేకా హత్య సూత్రధారి అవినాష్ గా CBI తేల్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం లో క్వీన్ గా కవిత ఉందని ఈడీ నిర్దారణకు వచ్చింది. ఇక వాళ్ళిద్దర్నీ అరెస్ట్ చేయటం మాత్రమే మిగిలి ఉంది. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. వైసీపీ ఎంపీ అవినాష్ కు ఢిల్లీ బీజేపీ అండ ఉందని సర్వత్రా తెలిసిందే. కానీ, కవిత విషయంలో మాత్రం అందుకు భిన్నం అంటూ ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ నుంచి తెలిగు రాష్ట్రాల రాజకీయాన్ని నిత్యం పరిశీలించే వాళ్ళు మాత్రం వైసీపీ, బీజేపీ, బీ ఆర్ ఎస్ ఒకే తానులో ముక్కలుగా చెబుతున్నారు. అందుకే అవినాష్, కవిత అరెస్ట్ వ్యవహారం ఆలస్యం అవుతుందని ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శ.

విచారణ సంగతి చూస్తూ ఉంటే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాదిరిగా అరెస్ట్ చూపిస్తారు అని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం లో కవితకు ఈడీ నుంచి పిలుపు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో బీ ఆర్ ఎస్ అధినేతగా దేశమంతా తిరిగి సత్తా చాటాలని భావిస్తున్న కేసీయార్ కి సొంత కూతురే అరెస్ట్ అయితే రాజకీయ ప్రకంపనలు సృష్టించడం ఖాయమనే అంటున్నారు.

ఏపీలో అధికార వైసీపీకి కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల కత్తి వేలాడుతోంది. ఒక వైపు జగన్ అక్రమాస్తుల కేసులో CBI విచారణ జోరు పెంచింది. ఇదే సమయంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు ఇపుడు కొలిక్కి వస్తోంది.ఈ కేసులో ఇప్పటిదాకా రెండు సార్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారణకు పిలిపించారు. ఆయనను తొలిసారి నాలుగున్నర గంటల పాటు మలివిడత ఆరు గంటల పాటు విచారించిన CBI మూడోసారి ఈ నెల 10న(శుక్రవారం) విచారణకు రమ్మంటోంది. ఈసారి కచ్చితంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం సాగుతోది. అదే కనుక జరిగితే మాత్రం ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామాలు తప్పవు.

ఏపీ సీఎం జగన్ తమ్ముడు అవినాష్ రెడ్డి వ్యవహారం వైసీపీలో కలవరం రేపడం ఖాయమని అంటున్నారు. అయితే బీజేపీతోనూ కేంద్ర ప్రభుత్వంతోనూ ఉన్న సత్సంబంధాల వల్ల ఎలాగైనా ఈ అరెస్ట్ను అడ్డుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కవిత అరెస్ట్ విషయంలో వెనక్కు తగ్గడాలూ ఉండవని అంటున్నారు.

తీగ లాగితే మొత్తం డొంక అంతా కదిలించాలని బీజేపీ పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతోంది. దాంతో కేసీయార్ అయితే బీజేపీతో అమీ తుమీ తేల్చుకోవడానికి రెడీ అవుతున్నందువల్ల ఏమైనా జరగవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇపుడు ఒకే మాదిరిగా రాజకీయాలు సాగడమే విశేషం. కేసులో లబ్ధిదారుల్లో కవిత ఒకరని కీలక కుట్రదారు కూడా అని ఈడీ కోర్టుకు ఆధారాలు అందించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన వారు దీనిపై సాక్ష్యం చెప్పారు. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అధికారులు అరెస్టు చేశారు. ఊహాగానాల ప్రకారం కవిత అరెస్ట్ ఉంటుందని అంటున్నారు. అదే టైం లో కవితని విచారణ పేరిట పిలిచి అరెస్ట్ చేయవచ్చు అని కూడా టాక్ నడుస్తోంది. ఈ నెల 11న కవిత ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరవుతున్నారు.

ఈ నెల 10 న అవినాష్ CBI ముందర, 11న కవిత ఈడీ ముందు నిందితులుగా నిలుస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలలోని ఇద్దరు ముఖ్యమంత్రులకు తలనొప్పిగా మారింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు కొరడా ఝలిపించడంతో ఏపీ తెలంగాణాలలో అధికార పార్టీ రాజకీయాలలో కలకలం బయలు దేరింది. తెలంగాణా సీఎం కేసీయార్ కుమార్తె. ఎమ్మెల్సీ అయిన కవిత విషయంలో ఈడీ ఉచ్చు బిగుస్తోంది. CBI ఏపీ సీఎం సోదరుని అరెస్ట్ కు రంగం సిద్ధం చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అరెస్ట్ ల పర్వంపై చర్చ జరుగుతుంది.

Also Read:  Chigurupathi Jayaram Case: చిగురుపాటి జయరాం హత్య కేసులో సంచలన తీర్పు ఇచ్చిన నాంపల్లి కోర్టు