Site icon HashtagU Telugu

Google: గూగుల్ మాజీ ఉద్యోగులకు భారీ షాక్.. అసలేం జరిగిందంటే?

Google Stock.jpeg

Google Stock.jpeg

Google: మాజీ ఉద్యోగులకు గూగుల్‌ గట్టి షాకిచ్చినట్లు తెలిసింది. మెటర్నిటీ,మెడికల్‌ లీవ్‌లో ఉండి, ఉద్యోగం కోల్పోయిన వారికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించబోవడం లేదని సమాచారం.అయితే గూగుల్‌ నిర్ణయం వెనుక గ్రూప్‌గా 100 మంది ఉద్యోగులు తీసుకున్న నిర్ణయమేనని స్పష్టమవుతోంది.

గూగుల్‌లో పనిచేస్తున్న 100 మం ది గ్రూప్‌గా ఉన్న ఉద్యో గులు లేయిడ్ ఆఫ్ ఆన్ లివ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్ధిక అనిశ్చితితో గూగుల్‌ ఈ ఏడాది జనవరి 12వేల మందిని తొలగించింది. వారిలో 100 మంది ఉద్యోగులు ఉన్నారు. వారికి మెడికల్‌,పెటర్నిటీ బెన్ఫి ట్స్‌ ఇచ్చేందుకు నిరాకరించింది.ఉద్యోగులు మాత్రం సంస్థ ఆమోదించినట్లుగానే పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

ఈ సందర్భంగా మాజీ ఉద్యో గుల బృందం గూగుల్‌ సీఈవో సుందర్ పిచాయ్, చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఫియోనా సిక్కోతో సహా ఎగ్జిక్యూటివ్‌లకు లేఖ రాశారు.ఆ లేఖలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.కానీ గూగుల్‌ నుంచి ఎలాంటి ప్రతి స్పందన రాలేదు.