HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Sports
  • ⁄Gujarat Giants %e0%b0%a2%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%80%e0%b0%95%e0%b0%bf %e0%b0%b7%e0%b0%be%e0%b0%95%e0%b1%8d %e0%b0%87%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8 %e0%b0%97%e0%b1%81

Gujarat Giants: ఢిల్లీకి షాక్ ఇచ్చిన గుజరాత్.. 11 పరుగుల తేడాతో ఢిల్లీపై గుజరాత్ విజయం

మహిళల ప్రీమియర్ లీగ్ 14వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) తలపడింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు ఢిల్లీ ముందు 148 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

  • By Gopichand Published Date - 07:37 AM, Fri - 17 March 23
Gujarat Giants: ఢిల్లీకి షాక్ ఇచ్చిన గుజరాత్.. 11 పరుగుల తేడాతో ఢిల్లీపై గుజరాత్ విజయం

మహిళల ప్రీమియర్ లీగ్ 14వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) తలపడింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు ఢిల్లీ ముందు 148 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 14వ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఎల్ వోల్వార్డ్ 57 పరుగులు, ఆష్లే గార్డనర్ అజేయంగా 51 పరుగులు చేశారు. అనంతరం ఢిల్లీ జట్టు 18.4 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది.

ఈ విజయంతో గుజరాత్ జట్టు ప్లేఆఫ్ రేసులో ఉంది. ఆరు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు, నాలుగు ఓటములతో నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అదే సమయంలో ఢిల్లీ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశాన్ని కోల్పోయింది. ఢిల్లీ జట్టుకు కావాల్సింది ఒక్క విజయం. ఆరు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ నాలుగు విజయాలు, రెండు ఓటములతో ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

Also Read: IND vs AUS ODI Series 2023: నేడు ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి వన్డే.. మొదటి మ్యాచ్ కు రోహిత్ దూరం..!

ఒక దశలో ఢిల్లీ ఎనిమిది వికెట్లకు 135 పరుగులు చేసింది. ఆ తర్వాత 13 బంతుల్లో 13 పరుగులు చేయాల్సి ఉంది. అప్పుడు క్రీజులో అరుంధతి రెడ్డి, శిఖా పాండే ఉండగా వీరిద్దరి మధ్య 35 పరుగుల భాగస్వామ్యం ఉంది. దీని తర్వాత కిమ్ గార్త్.. అరుంధతి రెడ్డిని అవుట్ చేసి మ్యాచ్ ను మలుపు తిప్పింది. 17 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 25 పరుగులు చేసి అవుట్ అయింది. ఆ తర్వాత ఓవర్‌లో గార్డనర్ పూనమ్ యాదవ్ (0)ని అవుట్ చేసి గుజరాత్‌కు విజయాన్ని అందించింది. ఈ విజయంతో గుజరాత్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. గుజరాత్ ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు, నాలుగు ఓటములు నమోదు చేసింది.

Telegram Channel

Tags  

  • delhi capitals
  • gujarat giants
  • WPL
  • WPL 2023
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

WPL 2023: ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ తొలి ఎడిషన్‌ విజయవంతం అవుతుందా?

WPL 2023: ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ తొలి ఎడిషన్‌ విజయవంతం అవుతుందా?

బీసీసీఐ మొదటిసారి నిర్వహిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 చివరి అంకానికి చేరుకుంది. నేటితో ఈ లీగ్ దశ

  • Delhi Capitals: 54 బంతుల్లోనే లక్ష్య ఛేదన.. ముంబైని ఓడించిన ఢిల్లీ..!

    Delhi Capitals: 54 బంతుల్లోనే లక్ష్య ఛేదన.. ముంబైని ఓడించిన ఢిల్లీ..!

  • RCB vs GG: బెంగళూరు ఘన విజయం.. 36 బంతుల్లో 99 పరుగులు చేసిన సోఫీ డివైన్

    RCB vs GG: బెంగళూరు ఘన విజయం.. 36 బంతుల్లో 99 పరుగులు చేసిన సోఫీ డివైన్

  • David Warner: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్..? త్వరలో అధికారిక ప్రకటన..!

    David Warner: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్..? త్వరలో అధికారిక ప్రకటన..!

  • RCB beat UP Warriorz: హమ్మయ్య.. తొలి విజయం సాధించిన బెంగళూరు

    RCB beat UP Warriorz: హమ్మయ్య.. తొలి విజయం సాధించిన బెంగళూరు

Latest News

  • Mumbai Indians: చివరి మ్యాచ్ లోనూ ఓడిన బెంగళూరు

  • Payal Rajput: అయ్యో పాయల్ రాజ్ పుత్… ఇంత పెద్ద వ్యాధితో బాధపడుతోందా!

  • Bhola Shankar: మెగాస్టార్ భోళా శంకర్ రీలీజ్ డేట్ ఫీక్స్.. ఎప్పుడంటే?

  • Aadhar PAN Link: మార్చి 31 వరకే డెడ్‌లైన్… వెంటనే మీ ఆధార్‌కు పాన్‌కార్డు లింక్ చేసుకోండిలా!

  • BJP bye to Janasena?: జై చంద్రబాబు, పవన్ ఆప్షన్ అదే.! జనసేనకు బీజేపీ బై?

Trending

    • Odisha Temple: ఎలుకలతో దేవతమూర్తులకు నిద్రాభంగం.. అలర్ట్ అయిన పూజారులు!

    • Unfit Cops: పంజాబ్ పోలీసులపై హైకోర్టు సీరియస్… 80 వేల మంది ఏం చేస్తున్నారంటూ !

    • Umesh Chandra:వైఎస్ రాజారెడ్డికి సంకెళ్లు వేసిన గ్రేట్ ఐపీఎస్

    • MS Dhoni: ధోని గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప..!

    • Rohit Sharma: రోహిత్ శర్మ బ్యాటింగ్ లోనే కాదు.. డ్యాన్స్ లో కూడా ఆదరగొట్టాడు.. వీడియో వైరల్..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: