Site icon HashtagU Telugu

Zomato CEO: డెలివ‌రీ బాయ్‌గా జొమాటో సీఈఓ.. ఊహించ‌ని షాక్‌..!

Zomato Ceo

Zomato Ceo

డెలివ‌రీ బాయ్స్ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా తెలుసుకోవడానికి జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ డెలివ‌రీ బాయ్‌గా వెళ్లారు. అయితే, ఓ మాల్‌లో ఆర్డర్‌ను కలెక్ట్ చేసుకునే సమయంలో ఆయ‌న‌కు ఒక విచిత్ర అనుభవం ఎదురైంది.

మాల్‌లోని సెక్యూరిటీ సిబ్బంది దీపిందర్‌ను లిఫ్ట్‌లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. చేసేదేంలేక, ఆయన మూడో అంతస్తుకు మెట్ల మార్గం ద్వారా వెళ్లి ఆర్డర్ తీసుకున్నారు. ఈ అనుభవాన్ని ప్రజలకు తెలియజేస్తూ, ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక పోస్టు చేశారు.

ఈ సంఘటన ద్వారా డెలివరీ బాయ్స్ సంక్షేమం దృష్ట్యా, మాల్స్‌తో కలిసి జొమాటో మరింత సాన్నిహిత్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించారు. దీనిపై నెటిజన్‌ల అభిప్రాయాలను అడిగి, వారు ఏమనుకుంటున్నారో తెలియజేయాలని కోరారు.