ఈరోజు ప్రత్యేకతల్లో ఒకటి వరల్డ్ రోజ్ డే (World Rose Day 2023) . ప్రపంచ వ్యాప్తంగా కాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న వారి జీవితాల్లో సంతోషాన్ని అందించడానికి ఈరోజున ‘వరల్డ్ రోజ్ డే ‘ (World Rose Day) గా యావత్ ప్రపంచం జరుపుకుంటుంది. వరల్డ్ కాన్సర్ డే అనేది ఫిబ్రవరి 04 న జరుపుకుంటారు. అయితే కాన్సర్ గురించి ప్రజల్లో అవగాహనా తెలుపడం..క్యాన్సర్ పేషేంట్లలలో ధైర్యం నింపేందుకు సెప్టెంబర్ 22 న వరల్డ్ రోజ్ డే గా పిలుచుకుంటారు.
ఈ వరల్డ్ రోజ్ (World Rose Day) నాడు క్యాన్సర్ (Cancer Patients) బాధితులకు చేతితో తయారుచేసిన గులాబీలు , కార్డులు మరియు బహుమతులు వారికీ అందజేస్తుంటారు. క్యాన్సర్ తో బాధపడుతున్న వారిలో బలాన్ని , ఆత్మ విశ్వాసం పెంపొందించేందుకు గాను ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
క్యాన్సర్ తో బాధపడుతున్న వారికీ గులాబీల పువ్వులు ఇస్తారు..వాటినే ఎందుకు ఇవ్వాలంటే..!
క్యాన్సర్ తో బాధపడుతున్న వారికీ ఈరోజున రోజ్ (గులాబీ ) పువ్వులను ఇవ్వడం చేస్తుంటారు. ఎందుకు గులాబీ పువ్వులనే ఇస్తారు..వేరే పువ్వు ఇవ్వచ్చు కదా అనే సందేహం మీలో రావొచ్చు. దీనికి కారణం గులాబీ అనేది ప్రేమకు , సున్నితత్వాన్ని చిహ్నంగా భావిస్తాం. గులాబీ పువ్వు అనేది ముళ్లపొదల్లో ఎదిగిన పువ్వు కాబట్టి ..ఎటువంటి బాధలనైనా , ఎటువంటి ఇబ్బందుల్లయినా తట్టుకుంటూ ఎదిగే స్వభావాన్ని చూపించడానికి గులాబీ పువ్వు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా క్యాన్సర్ బాధితులు వారు ఎదురుకుంటున్న ముళ్ళైనటువంటి క్యాన్సర్ యుద్దాన్ని ఎదురుకుంటూ..వారి యొక్క శక్తిని అందించడానికి ఓ నిదర్శనంగా కూడా ఈ గులాబీ పువ్వు పనిచేస్తుందని చెప్పి ..ప్రతి ఒక్క క్యాన్సర్ పేషంట్ కు ఈ వరల్డ్ రోజ్ డే నాడు వారికీ గులాబీ పువ్వును ఇవ్వడం జరుగుతుంది.
ఈ వరల్డ్ రోజ్ డే (World Rose Day) చరిత్ర :
వరల్డ్ రోజ్ డే ను కెనడాకు చెందిన 12 ఏళ్ల ‘మెలిండా రోజ్ ‘ జ్ఞాపకార్థం గా జరుపుకుంటారు. ఈ మెలిండా రోజ్ ఆస్కిన్ ట్యూమర్ అనే అరుదైన క్యాన్సర్ సోకి ఈమె మరణించడం జరిగింది. కాకపోతే ఈమె మరణించే ముందు చాలామంది జీవితాలను తాకడం జరిగింది. ఎలా అంటే ఆమె చివరి శ్వాస వరకు కూడా బ్రతికే ఆశ వదులుకోలేదు. ఆమె చివరి ఆరు నెలలు కూడా ఎలాగైనా బ్రతకాలని..ఈ అరుదైన క్యాన్సర్ నుండి బయటపడాలని పోరాడింది. అంతే కాదు తన చుట్టూ ఉన్న వారి జీవితాలను సానుకూలంగా తాకడం ద్వారా ప్రతి రోజు లెక్కించేలా చేసింది. ఓ పక్క ప్రాణం పోతుందని తెలిసి..ఉపిక లేకపోయినా..ఉపిక చేసుకొని..ప్రజల జీవితాల్లో ఆనందం నింపాలని కవితలు , ఈ మెయిల్స్ , ఉత్తరాలు రాస్తూ వారి జీవితాల్లో ఆనందం నింపింది. ఆమె యొక్క అద్భుతమైన మానవ స్పూర్తితో అనేక జీవితం పట్ల ఆసక్తి తో అనేక జీవితాలను మెలిండా రోజ్ తాకింది.
వరల్డ్ రోజ్ డే (World Rose Day) ప్రాముఖ్యత :
ఈ వరల్డ్ రోజ్ డే ‘మెలిండా రోజ్ ‘ కు మరియు ఆమెలాంటి చాలామంది క్యాన్సర్ పేషేంట్లకు అంకితం చేయబడింది. క్యాన్సర్ పేషేంట్లలో ధైర్యం నింపేందుకు వారికీ ఈరోజు అంకింతం . ‘మెలిండా రోజ్ ‘ప్రజల జీవితాలను స్పృశించిన తీరు , వరల్డ్ రోజ్ డే న క్యాన్సర్ రోగులతో నాణ్యమైన సమయాన్ని గడపడం ద్వారా మరియు వారి జీవితాల్లో ఆనందాన్ని అందించడం ద్వారా వారికీ తిరిగి ఇవ్వాలని గుర్తు చేసే విధంగా తెలుపడం జరిగింది. అందుకే వరల్డ్ రోజ్ డే నాడు చాలామంది క్యాన్సర్ పేషంట్ల ను కలిసి, వారితో టైం స్పెండ్ చేస్తుంటారు. అలాగే వారిలో ధైర్యాన్ని నింపుతూ..వారి కోర్కెలను తీరుస్తుంటారు. మీరు కూడా ఈరోజున మీ దగ్గర్లో ఎవరైనా క్యాన్సర్ తో బాధపడితే వారి దగ్గరికి వెళ్లి..కాసేపు మీ సమయాన్ని కేటాయించి..వారిలో ఆనందాన్ని నింపండి.
Read Also : Vijayawada Railway Restaurant : విజయవాడలో తొలి రైల్వే రెస్టారెంట్.. ‘హల్దీరామ్స్ ఆన్ వీల్స్’