Virat Kohli: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. ఒకవైపు యశస్వి జైస్వాల్, హర్షిత్ రానాలకు ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఉండగా, మరోవైపు విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఆడడం లేదు. విరాట్ గాయం ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా టెన్షన్‌ని పెంచింది.
విరాట్‌కు మోకాలికి గాయమైంది
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ ఆడడం లేదు. మోకాలి గాయంతో కోహ్లి తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు ఈ సిరీస్ చాలా కీలకం. ఇటువంటి పరిస్థితిలో ఆటగాళ్లందరూ ఈ సిరీస్ ఆడటం చాలా ముఖ్యం.
రోహిత్ ప్రకటన
టాస్ అనంతరం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో విరాట్ ఆడటం లేదు. గత రాత్రి అతనికి మోకాలి సమస్య వచ్చిందని రోహిత్ ప్రకటించాడు. మ్యాచ్‌కు ముందు కోహ్లి మోకాలికి బ్యాండేజీతో కనిపించాడు. తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ ఆడతాడా అని అభిమానులు ఎదురుచూశారు. అయితే ఇప్పుడు అభిమానుల ఎదురుచూపు మరికొంత పెరగనుంది. మరి కోహ్లీ రెండో వన్డేకు అయినా తిరిగి వస్తాడో లేదో చూడాలి.
Also Read: NEET For MBBS: ప్రభుత్వ కళాశాలల్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా?.. నీట్లో ఎన్ని మార్కులు రావాలంటే?
హర్షిత్ రానా, జైస్వాల్‌లకు అవకాశం దక్కింది
టీ20, టెస్టుల్లో సందడి చేసిన తర్వాత ఇప్పుడు యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణాలు టీమిండియా తరఫున వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేసే అవకాశం దక్కించుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు.
ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ.
ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (WK), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (c), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్.