Site icon HashtagU Telugu

American Cricket Team : టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా కెప్టెన్ మనోడే.. మోనాంక్ కెరీర్ గ్రాఫ్ ఇదిగో

American Cricket Team

American Cricket Team

American Cricket Team : టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. అమెరికా వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో మొదటి మ్యాచ్ జూన్ 1న అమెరికా, కెనడా మధ్య జరగనుంది.  ఈ తరుణంలో అమెరికా టీమ్‌ను ఒక భారత సంతతి ఆటగాడు  కెప్టెన్‌గా లీడ్ చేయబోతున్నాడు. అతడు ఎవరు ? అనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది. ఆ ప్లేయర్ పేరే.. మోనాంక్ పటేల్. ఈయన స్వస్థలం గుజరాత్. గతంలో గుజరాత్ స్టేట్ టీమ్ తరఫున కూడా మ్యాచ్‌లు ఆడాడు. 2018 సంవత్సరం నుంచి అమెరికా తరఫున క్రికెట్ ఆడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికా టీమ్స్ ఉన్నాయి. ఈ గ్రూపులో భారత్, పాక్ చాలా బలంగా ఉన్నాయి. కెనడా, అమెరికాలతో పోల్చుకుంటే ఐర్లాండ్ టీమే బలమైందని అంటున్నారు. ఈ తరుణంలో కెనడాతో జరుగుతున్న మొదటి మ్యాచ్‌ను లీడ్ చేయడం.. మోనాంక్ పటేల్‌కు పెద్ద సవాల్‌గా మారనుంది. కెప్టెన్‌గా ఉండటంతో సహజంగానే ఆయనపై ఒత్తిడి ఉంటుంది. దీన్ని అధిగమించి మ్యాచ్ కోసం వ్యూహం సిద్ధం చేయాల్సి ఉంటుంది. కాగా, ఈ ఏడాది జులై 14 నుంచి అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా ఒలింపిక్ గేమ్స్ జరగబోతున్నాయి. ఈసారి ఒలింపిక్ గేమ్స్ లిస్టులో క్రికెట్ కూడా ఉంది.  వాటికి సన్నాహకంగానే  ఇప్పుడు టీ20 క్రికెట్ వరల్డ్ కప్‌కు అమెరికా ఆతిథ్యమిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Train Fire : బంగ్లాదేశ్‌లో రైలుకు నిప్పంటించిన మూకలు.. ఐదుగురి మృతి