Site icon HashtagU Telugu

WhatsApp Channels : వాట్సాప్ ఛానల్స్‌లో సరికొత్త ఫీచర్.. ఇదిగో

Whatsapp Channels

Whatsapp Channels

WhatsApp Channels :  ఇప్పటికే వాట్సాప్‌లో ఉన్న ‘పోల్స్’ ఫీచర్ గురించి మనకు తెలుసు. త్వరలోనే ఈ ఫీచర్ వాట్సాప్ ఛానల్స్‌లోనూ అందుబాటులోకి రాబోతోంది. వాట్సాప్ ఛానల్స్ నిర్వాహకులు తమ ఫాలోయర్లకు మరింత చేరువయ్యేందుకు ‘పోల్స్’ ఫీచర్ దోహదం చేస్తుందని వాట్సాప్ భావిస్తోంది. దీనివల్ల ఛానల్స్ నిర్వాహకులు, ఫాలోయర్ల మధ్య ఎంగేజ్‌మెంట్‌ను పెంచుతుందని అంచనా వేస్తోంది. ఛానల్స్ నిర్వాహకులు ఇక తమ ఫాలోయర్ల నుంచి అభిప్రాయ సేకరణకు కూడా పోల్స్ ఫీచర్‌ను వాడుకోవచ్చని అంటోంది.  ఆండ్రాయిడ్ వర్షన్ 2.23.23.2‌లోని వాట్సాప్ బీటా వర్షన్‌లో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫీచర్‌ను టెస్ట్ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

దీనికి సంబంధించిన ఒక స్క్రీన్‌షాట్‌‌ను ‘వాట్సాప్ బీటా ఇన్ఫో’ విడుదల చేసింది. వాట్సాప్ ఛానల్‌లోని షేరింగ్ ఆప్షన్లలో కొత్తగా ‘పోల్’ అనే ఫీచర్  చేరిపోయిందని అందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైనా వాట్సాప్ ఛానెల్ పోల్‌లో మీరు పాల్గొన్నా.. మీ ఫోన్ నంబర్ బయట ఎవరికీ కనిపించదు. అంతా గోప్యంగా ఉంచబడుతుంది. కనీసం వాట్సాప్ ఛానల్ యజమాని, తోటి ఫాలోయర్లకు కూడా పోల్‌లో మీరు పాల్గొన్న సమాచారం బహిర్గతం కాదు. దీన్నిబట్టి వాట్సాప్ ఛానల్స్‌లో వ్యక్తిగత సమాచార గోప్యత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాట్సాప్ ఛానల్స్ నిర్వాహకులు తమ ప్రేక్షకుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు పోల్స్ ఫీచర్‌ను(WhatsApp Channels)  వాడుకోవచ్చు.

Also Read: Attractive Offers On Cars: మారుతీ సుజుకీ, హ్యుందాయ్ కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు.. ఈ కారుపై రూ.2 లక్షల వరకు తగ్గింపు..!