Site icon HashtagU Telugu

Highest Railway Bridge in the World: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన పై నుంచి ట్రైన్ రన్

The Train Runs From The Top Of The Highest Railway Bridge In The World

The Train Runs From The Top Of The Highest Railway Bridge In The World

Highest Railway Bridge in the World : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన (Highest Railway Bridge) కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఉంది. తొలిసారిగా దీనిపై నుంచి త్వరలో ట్రైన్ పరుగులు తీయనుంది. రాంచీ – జమ్ము తావి మధ్య నడిచే 18309 నంబర్ SBP JAT ఎక్స్ ప్రెస్ ను నేరుగా శ్రీనగర్‌ వరకు నడపాలని రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది. ఈ రైలు వారానికి 4 రోజులు( (సోమ, మంగళ, గురు, శనివారాల్లో) నడుస్తుంది.ఇప్పటికే ఈ వంతెన పై ట్రయల్ రన్ పూర్తి చేశారు. మహేంద్ర బొలెరో కారును రైలు తనిఖీ వాహనంగా మార్చారు. చీనాబ్ వంతెనపై కారు నడుస్తున్న చిత్రాలు వైరల్ అయ్యాయి. ఈ వంతెన జనవరి 2024 నాటికి లోయను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది.

వంతెన విశేషాలు

  1. వంతెనను ఉక్కుతో నిర్మించారు.
  2. మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను ఈ వంతెన తట్టుకోగలదు.
  3. చీనాబ్ వంతెన ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉంది.
  4. ఇది చీనాబ్ నదికి 359 మీటర్లు (1,178 అడుగులు) ఎత్తులో ఉంది.
  5. ఇది వంపు వంతెన.
  6. చీనాబ్ బ్రిడ్జి పొడవు 1315 మీటర్లు, దీని నిర్మాణానికి రూ.1400 కోట్లు ఖర్చయ్యాయి.
  7. ఇది 260 కి.మీ పొడవు ఉంది.
  8. ఇది బలమైన గాలులను తట్టుకోగలదు.
  9. ఇది మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు.
  10. ఈ ఆర్క్ బ్రిడ్జ్ రియాక్టర్ స్కేల్‌పై 8 తీవ్రతతో వచ్చిన భూకంపం మరియు 30 కిలోల పేలుడు పదార్థాల పేలుడును తట్టుకోగలదు.
  11. చీనాబ్ రైల్వే వంతెన “260 kmph వేగంతో వీచే గాలులను తట్టుకోగలదు.
  12. ఈ వంతెన జీవిత కాలం 120 సంవత్సరాలు.
  13. 2003 లో ఈ వంతెన పనులు మొదలై 2003లో పూర్తయ్యాయి.

రైల్వేశాఖ ప్రకటన

చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ అన్ని పరీక్షలు నిర్వహించామని, అవన్నీ విజయవంతం అయినట్లు కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ వంతెన అధిక గాలులు, ఉష్ణోగ్రత, భూకంపాలను తట్టుకుంటుందా..? అనే పరీక్షలు నిర్వహించారు. వంతెన ప్రారంభానికి సిద్ధంగా ఉందని, వంతెనపై రైల్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Also Read:  YouTube Village: ఈ గ్రామ విశిష్టత ఏంటో తెలుసా? మరియు అది ఎక్కడ ఉంది?