BiggBoss 6: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. జోరుగా ప్రచారం అవుతున్న బిగ్ గాసిప్!
తెలుగు బుల్లితెర పేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్ బాస్ సీజన్ 6 ఇటీవలే మొదలైయి అప్పుడే రెండవ
- By Nakshatra Published Date - 06:30 PM, Sat - 17 September 22
తెలుగు బుల్లితెర పేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్ బాస్ సీజన్ 6 ఇటీవలే మొదలైయి అప్పుడే రెండవ వారం ఎలిమినేషన్స్ వరకు చేరుకుంది. రేపు అనగా ఆదివారం బిగ్ బాస్ హౌస్ లో రెండవ వారం ఎలిమినేషన్స్ జరగనున్నాయి. అయితే ఇప్పటికే మొదటివారం ఎలిమినేషన్ లేదు అంటూ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున మొదటి వారం ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రేక్షకులు షాక్ అయినప్పటికీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు మాత్రం సంతోషపడ్డారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే బిగ్ బాస్ హౌస్ లో రెండవ వారం డబుల్ ఎలిమినేషన్ జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ వారం రెండవ వారం కలిపి రెండో వారం డబుల్ ఎలిమినేషన్ జరగబోతున్నట్టు తెలుస్తోంది. అయితే రెండవ వారం సాధారణ కంటెస్టెంట్లు ఎక్కువగా నామినేషన్ లోకీ వచ్చారు. పైమా, ఆదిరెడ్డి, చలాకీ చంటి, గీతు రాయల్, అభినయ, షాని ఇలా అందరూ నామినేషన్ లోకీ వచ్చారు. కాగా ఇప్పుడు హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్లు బయటకు వెళ్లే సమయం ఆసన్నమయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ వార్తలలో నిజానిజాలు తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే మరి. ఎవరెవరు ఎలిమినేట్ కాబోతున్నారు అన్న విషయానికి వస్తే..అభినయ, షాని ఇద్దరు ఎలిమెంట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అభినయ మొదటి వారిని ఎలిమినేట్ కావాల్సి ఉండగా మొదటి వారం ఎలిమినేషన్ లేదు అని చెప్పడంతో ఆమె సేఫ్ అయింది. రెండవ వారం అయితే తప్పనిసరిగా ఆమె ఎలిమినేషన్ అవుతుంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
Related News
Pallavi Prashanth: రైతు బిడ్డ ముసుగులో అలాంటి పనులు చేస్తున్న పల్లవి ప్రశాంత్.. బయటపడ్డ మోసం?
తెలుగు బిగ్ బాస్ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి మనందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ పేరు వినిపిస్తూనే ఉంది. పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వైరల్ అవుతూనే ఉన్నాయి. తరచూ ఏదో ఒక విషయంతో పల్లవి ప్రశాంత్ పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. అయితే ప్రశాంత్ హౌస్ లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన వారే ఇప్పుడు బయటకు వచ్చి