Site icon HashtagU Telugu

Rohan Bopanna : నంబర్‌ 1‌ స్థానానికి రాకెట్‌లా దూసుకెళ్లిన రోహన్‌ బోపన్న

Rohan Bopanna

Rohan Bopanna

Rohan Bopanna : అత్యంత పెద్ద వయసులో టెన్నిస్ పురుషుల డబుల్స్ నంబర్‌ వన్‌ ర్యాంకర్‌గా  రోహన్ బోపన్న అవతరించాడు. 43 ఏళ్ల వయసులో ప్రపంచ నంబర్‌వన్‌‌గా నిలిచి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్‌ డబుల్స్‌లో తన పార్ట్‌నర్‌ మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి సెమీస్‌కు చేరుకోవడంతో బోపన్నకు ఈ ఘనత సొంతమైంది. క్వార్టర్ ఫైనల్‌లో అర్జెంటీనా జంట మాక్సిమో గొంజాలెజ్‌-ఆండ్రెస్‌ మోల్టేనిపై వరుస సెట్లలో 6-4, 7-5 తేడాతో రోహన్‌ జోడీ గెలిచింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు ముందు బోపన్న మూడో ర్యాంకులో ఉన్నాడు. అప్‌డేట్ చేసిన ర్యాంకుల జాబితా వచ్చే వారం రిలీజ్ అవుతుంది. ఇక బోపన్న డబుల్స్ పార్ట్‌నర్‌ మాథ్యూ ఎబ్డెన్‌ రెండో ర్యాంకుకు చేరాడు.

We’re now on WhatsApp. Click to Join.

గతంలో ఈ రికార్డు అమెరికాకు చెందిన రాజీన్​ రామ్​ పేరు మీద ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్​ను బోపన్న బ్రేక్​ చేసి నంబర్​వన్​ స్థానానికి వెళ్లాడు. రాజీవ్​ రామ్​ 38 ఏళ్ల వయసులో ప్రపంచ నంబర్​వన్​ ర్యాంక్​ను సాధించాడు. ఇక రోహన్​ బోపన్న(Rohan Bopanna) 20 ఏళ్ల టెన్నిస్ కెరీర్‌లో నంబర్ వన్ ర్యాంకును సాధించడం ఇదే తొలిసారి. బోపన్న కంటే ముందు నంబర్ వన్ ర్యాంకును లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా వరల్డ్ నంబర్​ వన్​గా నిలిచారు.

Also Read :Innovative Wedding : ఈ పెళ్లి వేడుకలో ఏం చేశారో తెలుసా ?

దీనిపై రోహన్​ బోపన్న స్పందిస్తూ.. ‘‘నంబర్ వన్​ ర్యాంక్ సాధించినందుకు ఆనందంగా ఉంది. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. భారత్ తరపున మొదటి ర్యాంక్ కైవసం చేసుకున్నందుకు  గర్వంగా ఉంది. మా టీమ్ మొత్తానికి క్రెడిట్‌ వర్తిస్తుంది. ఈ విజయంలో కుటుంబం, కోచ్‌, ఫిజియో ఇలా ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. నా విజయం మరింత మంది టెన్నిస్‌లోకి రావడానికి మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నా’’ అని చెప్పారు.

సానియా ఆస్తులెన్నో తెలుసా ?

గతేడాది టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన సానియా, తాజాగా విడాకులతో మరోసారి వార్తల్లో నిలిచింది. పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌కు ఆమె విడాకులు ఇచ్చింది. 2023 నాటికి ఆమె నికర సంపద దాదాపు రూ.210 కోట్లకు సమానం. తన కెరీర్‌లో సానియా మీర్జా మొత్తం ఆరు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిళ్లను కైవసం చేసుకుంది. 2015లో రెండు, 2009, 2012, 2014, 2016లో ఒకటి చొప్పున గెలుచుకుంది. కెరీర్‌లో అరుదైన రికార్డ్‌లను తన పేరున లిఖించుకుంది. డబుల్స్‌లో వరల్డ్ నంబర్ 1 ర్యాంక్ సొంతం చేసుకుంది. ఈ ఫీట్‌ను 2015 ఏప్రిల్‌లో సాధించింది. దాదాపు 91 వారాల పాటు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కెరీర్‌లో 43 డబుల్స్ టైటిల్స్‌ సాధించింది. 2016లో టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో సానియా స్థానం సంపాదించడం విశేషం.