Patanjali Apology Ads : సుప్రీంకోర్టు వార్నింగ్.. క్షమాపణలతో న్యూస్‌పేపర్లలో పతంజలి ‘బిగ్’ యాడ్స్

Patanjali Apology Ads : సుప్రీంకోర్టు వరుసపెట్టి పెట్టిన చివాట్లకు పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ సహ వ్యవస్థాపకులు బాబా రామ్ దేవ్ దిగొచ్చారు.

  • Written By:
  • Publish Date - April 24, 2024 / 09:18 AM IST

Patanjali Apology Ads : సుప్రీంకోర్టు వరుసపెట్టి పెట్టిన చివాట్లకు పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ సహ వ్యవస్థాపకులు బాబా రామ్ దేవ్ దిగొచ్చారు. పత్రికలకు పతంజలి సంస్థ తప్పుడు యాడ్స్‌ను ఇచ్చిన కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానానికి క్షమాపణలు చెబుతూ ఆయన పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. దీనికి సంబంధించిన క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంగళవారం రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం పతంజలి సంస్థ నిర్వాహకులపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ రోజు న్యూస్ పేపర్ లో ఇచ్చిన క్షమాపణల ప్రకటన.. గతంలో పతంజలి ఉత్పత్తుల కోసం ఇచ్చిన ఫుల్ పేజీ ప్రకటనల మాదిరే ఉందా ? మీరు కోరే ఆ క్షమాపణలు తాలూకు అక్షరాల సైజు కూడా.. ఆనాడు పతంజలి ప్రకటనలప్పుడు ఇచ్చిన సైజులో ఉన్నాయా? ’’ అని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పతంజలి నిర్వాహకులు బాబా రాందేవ్, బాలకృష్ణలను ప్రశ్నించింది. ఈనేపథ్యంలో ఇవాళ ఉదయం పలు పత్రికల్లో పతంజలి సంస్థ కాస్త పెద్ద సైజులో యాడ్స్‌ను ఇవ్వడం గమనార్హం.

We’re now on WhatsApp. Click to Join

మంగళవారం రోజు మరోసారి సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన  పతంజలి నిర్వాహకులు.. దాదాపు రూ.10 లక్షలతో 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని కోర్టుకు తెలియజేశారు. దీనికి స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం..  పతంజలిపై రూ. 100 కోట్ల జరిమానా విధించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేసింది. అనంతరం పతంజలి కంపెనీ తరఫు న్యాయవాది వివరణ ఇస్తూ.. పత్రికల్లో క్షమాపణలను మరింత పెద్ద సైజులో ప్రకటిస్తామని తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసును మరో వారం వాయిదా వేసింది.

Also Read : AC on Rent : సమ్మర్ నీడ్.. ఏసీ కొనలేరా.. రెంటుకు తీసుకోండి !

యోగా విన్యాసాలతో ప్రపంచ స్థాయిలో గొప్ప పేరు సంపాదించిన యోగా గురువు బాబా రాందేవ్.. కరోనా సమయంలో పతంజలి ఆయుర్వేద ఔషధం కరోనిల్ పై ప్రచారం చేశారు. కరోనిల్‌పై న్యూస్ పేపర్లలో పెద్దపెద్ద యాడ్స్ కూడా ఆనాడు వేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అప్పట్లో సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ వ్యవహారంలో 2023 నవంబరు 22న పతంజలి నిర్వాహకులు ప్రెస్ మీట్ పెట్టి మరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీన్ని కూడా ఇటీవల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తప్పుపట్టింది.  కోర్టు ధిక్కరణకు పాల్పడిన పతంజలి ఆయుర్వేద సంస్థను క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో ఇవాళ న్యూస్ పేపర్లలో వచ్చిన యాడ్‌లోనూ(Patanjali Apology Ads) ఆనాడు ప్రెస్ మీట్ పెట్టినందుకు బాబా రాందేవ్ క్షమాపణలు కోరారు.

Also Read :Technical Graduates : ప్రతినెలా లక్ష శాలరీ.. ఆర్మీలో జాబ్స్..