Site icon HashtagU Telugu

Attack On Pak : పాక్ వైమానిక స్థావరంపై సూసైడ్ ఎటాక్.. ఏమైందంటే ?

Attack On Pak

Attack On Pak

Attack On Pak : పాకిస్థాన్‌లోని ఉత్తర ప్రాంతం మియాన్‌వాలిలో ఉన్న పాక్ వైమానిక స్థావరంపై శనివారం తెల్లవారుజామున ఆరుగురు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. సాయుధ ఉగ్రవాదులు గోడలు ఎక్కి ఎయిర్ బేస్‌లోకి చొరబడ్డారు. లోపలికి ప్రవేశించగానే యుద్ధ విమానాలు ఉన్న చోటుకు.. ముగ్గురు టెర్రరిస్టులు చేరుకొని తమను తాము పేల్చుకున్నారు. దీంతో అక్కడున్న మూడు యుద్ధ  విమానాలు ధ్వంసమయ్యాయి. విమాన ఇంధన ట్యాంకుకు కూడా నష్టం వాటిల్లింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఘటనలో అక్కడున్న పలువురు సైనిక సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఏదైనా ప్రాణ నష్టం జరిగిందా ? లేదా ? అనేది తెలియరాలేదు. పాక్ సైనికులు వెంటనే అప్రమత్తమై.. ఆత్మాహుతికి రెడీ అయిన మరో ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.ఈ దాడికి తామే బాధ్యులమని తాలిబన్లతో సంబంధం ఉన్న ‘తెహ్రీక్-ఎ-జిహాద్ పాకిస్థాన్’ గ్రూప్ ప్రకటించిందని పాక్ మీడియాలో కథనాలు (Attack On Pak) వస్తున్నాయి.

Also Read: Hardik Pandya Ruled Out: టీమిండియాకు బిగ్ షాక్.. గాయం కారణంగా వరల్డ్ కప్ కు దూరమైన పాండ్యా..!