TikTok Tragedy : 14 ఏళ్ల బాలిక తన సోదరిని దారుణంగా తుపాకీతో కాల్చి చంపింది. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు.. టిక్ టాక్ వీడియోను తీసే క్రమంలో ఆ బాలిక తన సోదరితో గొడవ పడింది. ఇద్దరూ ఘర్షణకు దిగారు. ఒకరినొకరు కొట్టుకున్నారు. చివరకు ఇంట్లో ఉన్న తుపాకీని తీసుకొచ్చి సోదరిపై ఆ బాలిక ఆగ్రహంతో ఫైరింగ్ చేసింది. దీంతో ఆ బాలిక సోదరి అక్కడికక్కడే తీవ్ర రక్తస్రావానికి గురై చనిపోయింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న గుజ్రత్ జిల్లాలోని సరాయ్ అలంగీర్ పట్టణంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆ బాలిక సోదరుడి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు(TikTok Tragedy) చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
అంతకుముందు డిసెంబర్లో పాకిస్తాన్‌లోని షేక్‌పురా జిల్లాలోనూ టిక్‌టాక్ వీడియోను చిత్రీకరిస్తూ ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు సఫ్దరాబాద్ తహసీల్‌లోని ఖాన్ఖా డోగ్రాన్ నగరవాసులు. వీరంతా కలిసి మోటార్ సైకిల్‌పై వెళ్తూ టిక్‌టాక్ వీడియో తీస్తుండగా.. పరధ్యానం కారణంగా ఎదురుగా వచ్చిన కారును మోటార్ సైకిల్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువకులు కూడా మృతిచెందారు.గతంలో పాక్ ప్రభుత్వం టిక్ టాక్ పై 5 నెలలపాటు నిషేధాన్ని విధించింది. యాప్ లో అసభ్యకర కంటెంట్ తీసేసిన తరువాత నిషేధాన్ని ఎత్తేసింది.
Also Read: Revanth – KomatiReddy – Song : కోమటిరెడ్డి – రేవంత్ సాంగ్.. ‘కంచె ఒకడైతే.. అది మించెవాడొకడే’
జాతీయ భద్రత దృష్ట్యా చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను భారతదేశంలో బ్యాన్ చేసి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతోంది. ప్రజల డేటాను చైనా అధికార పార్టీకి షేర్ చేస్తోందనే ఆరోపణలపై టిక్ టాక్ ను భారత్ బ్యాన్ చేసింది. ఇది జరిగిన మూడేళ్ల తర్వాత 2023 ఫిబ్రవరిలో తన మొత్తం భారతీయ ఉద్యోగులను తొలగించింది. తొలగించిన ఉద్యోగులకు మూడు నుంచి తొమ్మిది నెలల వరకు జీతం అందించింది.