Facebook Live Murder : ఫేస్‌బుక్ లైవ్‌‌లోనే మర్డర్, సూసైడ్.. వీడియో వైరల్.. ‘మహా’ కలకలం

Facebook Live Murder : ఫేస్‌బుక్ లైవ్‌లోనూ అఘాయిత్యాలు జరగడం కామన్‌గా మారుతోంది.

  • Written By:
  • Publish Date - February 9, 2024 / 07:15 AM IST

Facebook Live Murder : ఫేస్‌బుక్ లైవ్‌లోనూ అఘాయిత్యాలు జరగడం కామన్‌గా మారుతోంది.  తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఫేస్ బుక్ లైవ్ జరుగుతుండగానే మర్డర్, సూసైడ్ రెండూ జరిగిపోయాయి. ఉద్ధవ్ థాక్రే శివసేన వర్గానికి చెందిన  మాజీ ఎమ్మెల్యే  వినోద్ ఘోసల్కర్ కుమారుడు అభివషేక్ ఘోసల్కర్‌పై మౌరిస్ భాయ్ అనే వ్యక్తి అతి సమీపం నుంచి మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. మౌరిస్ భాయ్ అనే వ్యక్తి అతి సమీపం నుంచి రెండు మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో అభిషేక్ ప్రాణాలు కోల్పోయారు. ఆ వెంటనే మౌరిస్ భాయ్ కూడా తనను తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలో ఉన్న మౌరిస్ భాయ్ ఆఫీసులో అభివషేక్ ఘోసల్కర్‌ ఫేస్‌బుక్ లైవ్‌(Facebook Live Murder)  చేస్తుండగా ఈ  ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రికి తరలించిన కాసేపటికే అభిషేక్ ప్రాణాలు కోల్పోయాడు. కాల్పుల ఘటన అంతా ఫేస్‌బుక్‌ లైవ్‌లో రికార్డు అయింది. దీనిపై సీఎం ఏక్‌నాథ్‌ షిండే విచారణకు ఆదేశించారు.

https://twitter.com/srinivasiyc/status/1755628336876028005?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1755628336876028005%7Ctwgr%5Ead1c09cdde563341a5e3461a8af9ed597fe573e9%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.oneindia.com%2Fnews%2Findia%2Fuddhav-sena-leader-abhishek-ghosalkar-shot-dead-during-facebook-live-374429.html

We’re now on WhatsApp. Click to Join

ఆఫీసుకు పిలిచి మరీ..

మాజీ ఎమ్మెల్యే వినోద్ ఘోసల్కర్‌ను ఉద్ధవ్ ఠాక్రేకు సన్నిహితుడిగా భావిస్తారు. ముంబై బిల్డింగ్ రిపేర్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ బోర్డు ఛైర్మన్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు. అభిషేక్, ఆయన భార్య కూడా ప్రస్తుతం మున్సిపల్ కౌన్సిలర్లుగా ఉన్నారు.  అభిషేక్‌కి మౌరిస్‌ భాయ్‌తో శత్రుత్వం ఉన్నట్లు సమాచారం. అయితే ఇటీవల వారిద్దరూ రాజీ పడ్డారు. తాజాగా అభిషేక్‌ను మౌరిస్ తన కార్యాలయంలో ఒక కార్యక్రమానికి పిలిచి ఈ దారుణానికి పాల్పడ్డాడు.

Also Read : New Sand Policy : ఇసుక​ అమ్మకాలకు కొత్త పాలసీ- సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ఈనేపథ్యంలో  ఏక్‌నాథ్ షిండే శివసేన- బీజేపీ సంకీర్ణ సర్కారుపై ఉద్దవ్ థాక్రే శివసేన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మహారాష్ట్రలో రౌడీలను తయారు చేసే పనిలో ప్రభుత్వం బిజీగా ఉందని ఉద్ధవ్ సేన అధికార ప్రతినిధి ఆనంద్ దూబే అన్నారు. ప్రజాప్రతినిధులకే భద్రత లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.  బీజేపీ చెబుతున్న రామరాజ్యం అంటే ఇదేనా అని ఉద్ధవ్ వర్గం శివసేన కీలక నేత సంజయ్ రౌత్ అన్నారు. అంతకుముందు, ఉల్హాస్‌నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన నాయకుడిపై కాల్పులు జరిపిన బీజేపీ ఎమ్మెల్యే వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఈ ఘటన తర్వాత మహారాష్ట్ర శాంతిభద్రతలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది జరిగిన మరుసటి రోజే అభిషేక్ ఘోసల్కర్‌పై కాల్పుల ఉదంతం వెలుగులోకి వచ్చింది.