Site icon HashtagU Telugu

Ola E Bike : హైదరాబాద్‌లో ‘ఓలా ఈ-బైక్స్’.. ఛార్జీ కిలోమీటరుకు 5 మాత్రమే

OLA Electric IPO Listing

OLA Electric IPO Listing

Ola E Bike : హైదరాబాద్‌లో క్యాబ్ సేవలను ఉపయోగించే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే.. ఇకపై మీరు సిటీలో రైడ్ కోసం చెల్లించే అమౌంట్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఓలా తన ఈ-బైక్ సేవలను హైదరాబాద్‌లో  ప్రారంభిస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ‘రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్’ కింద ఢిల్లీ, హైదరాబాద్‌లలో ఈ-బైక్ సర్వీసును  ఓలా ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే ఈ-బైక్‌ల సంఖ్యను పెంచుతామని వెల్లడించింది.  వచ్చే 2 నెలల్లో ఢిల్లీ, హైదరాబాద్‌లలో 10వేల ఈ-బైక్‌లను అందుబాటులోకి  తేవాలని కంపెనీ యోచిస్తోంది. బెంగళూరులో తొలివిడతగా ఓలా ఈ-బైక్ సేవలను నడిపారు. పైలట్ ప్రాజెక్టుగా అక్కడ ఈ – బైక్‌లను నడపడంతో  సత్ఫలితాలు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఢిల్లీ, హైదరాబాద్‌‌లలో కూడా ఈ -బైక్(Ola E Bike) సేవలను ప్రారంభించారు.

We’re now on WhatsApp. Click to Join.

Also Read : Top 5 Power Banks : పవర్ బ్యాంక్ కొంటారా ? టాప్ 5 ఆప్షన్స్ ఇవే

ఓలా యూనిటీ హెరిటేజ్ రైడ్

గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఓలా యూనిటీ హెరిటేజ్ రైడ్ పేరుతో భారీ కమ్యూనిటీ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది. రైడ్‌లో భాగంగా ఓలా కమ్యూనిటీకి చెందిన వందలాది మంది సభ్యులు భారతదేశ వారసత్వం, సంస్కృతిని ప్రోత్సహించడానికి విద్యుద్దీకరణ స్ఫూర్తి, దేశభక్తి ఉత్సాహంతో దేశంలోని 26 నగరాల్లోని వారి సమీప వారసత్వ ప్రదేశానికి వెళ్లారు. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాహన ప్రియులు ఈవీకి మారడానికి, భారత ఈవీ విప్లవంలో చేరేందుకు అద్భుతమైన తగ్గింపును ప్రకటించింది. ఈ క్రమంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై గరిష్ఠంగా రూ.25,000 తగ్గింపులను జనవరి 31, 2024 వరకు అందుబాటులో ఉంచింది. అలాగే కస్టమర్లకు అదనపు వారెంటీపై 50 శాతం తగ్గింపును అందిస్తోంది. అలాగే ఓలా S1 ప్రో, S1 ఎయిర్ మోడల్‌లపై రూ.2,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. అలాగే ఎంపిక చేసిన క్రెడిట్ కార్డు ఈఎంలపై వినియోగదారులుకు రూ.5,000 తగ్గింపును అందిస్తోంది. అయితే ఇతర ఫైనాన్స్ ఆఫర్‌లలో జీరో డౌన్ పేమెంట్, జీరో-ప్రాసెసింగ్ ఫీజు, 7.99% తక్కువ వడ్డీ రేట్లు వంటి ఇతర డీల్స్ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయి. అదనంగా S1 X+పై ఫ్లాట్ రూ.20,000 తగ్గింపుతో రూ.89,999 రేటుకు మార్కెట్లో అందుబాటులో ఉంది.