Site icon HashtagU Telugu

Peter Higgs : దైవకణం కనుగొన్న శాస్త్రవేత్త ఇక లేరు.. ఏమైందంటే..

Peter Higgs

Peter Higgs

Peter Higgs : నోబెల్‌ బహుమతి గ్రహీత, బ్రిటన్‌‌కు చెందిన విఖ్యాత భౌతిక శాస్త్రవేత్త  పీటర్‌ హిగ్స్‌ (94) కన్నుమూశారు. ప్రపంచంలోనే తొలిసారిగా దైవ కణాన్ని (గాడ్ పార్టికల్)‌ను కనుగొన్నది ఈయనే. ఆ కణానికి హిగ్స్‌ బోసన్‌ అనే పేరు పెట్టారు.  స్వల్ప అస్వస్థతకు గురైన హిగ్స్‌ .. బ్రిటన్‌‌లోని తన నివాసంలో చికిత్సపొందుతూ సోమవారం రోజు తుదిశ్వాస విడిచారు. ఈవివరాలను ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ వెల్లడించింది. గొప్ప ఉపాధ్యాయుడిగా, మార్గనిర్దేశకుడిగా, యువ శాస్త్రవేత్తలకు పీటర్‌ హిగ్స్‌  స్ఫూర్తి ప్రదాత అని ప్రశంసలు కురిపించింది. కాగా, ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీలో హిగ్స్ 50 ఏళ్ల పాటు ప్రొఫెసర్‌గా పనిచేశారు.

We’re now on WhatsApp. Click to Join

దైవకణం (హిగ్స్‌బోసన్‌) సిద్ధాంతంతో  పీటర్ హిగ్స్(Peter Higgs) చాలా రీసెర్చ్ చేశారు. ఎలక్ట్రాన్, క్వార్క్‌, కణానికి, విశ్వానికి ద్రవ్యరాశి ఎలా వచ్చిందనే  వివరాలను ఆయన  తన రీసెర్చ్ ద్వారా  వెలుగులోకి తెచ్చారు. 1964లో బోసన్‌ కణం ఉనికిని తన సిద్ధాంతాల ద్వారా  పీటర్ హిగ్స్ నిరూపించారు.  2012లో యూరోపియన్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ న్యూక్లియర్‌  రీసెర్చ్‌లోని లార్జ్‌ హ్యాడ్రన్‌ కొల్లాయిడర్‌లో దైవకణంపై ఆయన  ప్రయోగాలు చేశారు. ఆ రీసెర్ఛ్‌లో సాధించిన ఫలితాల ఆధారంగా అర శతాబ్దానికి ముందే దైవకణ సిద్ధాంతాన్ని హిగ్స్‌  ప్రతిపాదించారు. దాన్ని తర్వాతి కాలంలో శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా  నిర్ధారించారు. దైవకణంపై చేసిన పరిశోధనలకుగానూ  బెల్జియన్‌ భౌతికశాస్త్రవేత్త ఫ్రాంకోయిస్‌తో కలిని 2013లో హిగ్స్‌కు  నోబెల్‌ బహుమతి లభించింది.

Also Read : PBKS vs SRH: 2 పరుగుల తేడాతో పంజాబ్ ను ఓడించిన సన్‌రైజర్స్

దైవకణ సిద్ధాంతం అంటే.. ?

హిగ్స్ ప్రతిపాదించిన దైవకణ సిద్ధాంతం ప్రకారం.. విశ్వం ఆవిర్భవించడంలో దైవకణమే చాలా కీలకం. హిగ్స్ వివిధ పరిశోధనలు చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. హిగ్స్‌బాసన్ చెప్పిన దైవకణాల వల్లే పరమాణువులకు ద్రవ్యరాశి ఏర్పడుతుందని, వాటి వల్లే విశ్వం ఏర్పడిందని భౌతిక శాస్త్రవేత్తలు నేటికీ నమ్ముతున్నారు. ఒకవేళ  దైవకణం లేకపోతే అణువులు ఏర్పడటం సాధ్యం కాదని.. అలాంటప్పుడు మన విశ్వంలో గ్రహాల దగ్గరి నుంచి జీవరాశుల వరకు దేనికీ  ఉనికి ఉండదని సైంటిస్టులు అంటున్నారు. అసలు ఏమిటీ దైవకణం అనే విషయాన్ని తెలుసుకోవడానికి స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో ‘సెర్న్’ అనే పరిశోధనా సంస్థ ఓ భారీ భూగర్భ పరిశోధనా కేంద్రాన్ని నిర్మించింది. అందులో  ‘లార్జ్ హాడ్రన్ కొల్లైడర్’ పేరుతో 18మైళ్ల పొడవైన సొరంగాన్ని నిర్మించింది. విశ్వం ఆవిర్భావానికి మూలంగా భావిస్తున్న బిగ్ బ్యాంగ్(మహా విస్ఫోటం)ను ఈ సొరంగంలో కృత్రిమంగా సృష్టించారు. ఇందులో భాగంగా  రెండు ఫొటాన్ పరమాణువులను కాంతి వేగంతో ఢీకొట్టించారు. ఈ విధంగా  ఢీకొనడం వల్ల పుట్టిన మూలకాలపై శాస్త్రవేత్తల రెండు వేర్వేరు టీమ్‌లు రీసెర్ఛ్ చేశాయి. ఈ రెండు టీమ్‌లు కూడా ఆ మూలకాలలో దైవ కణం (హిగ్స్ బాసన్ కణం) ఉందని గుర్తించారు.