Site icon HashtagU Telugu

Israel – Gaza War : ఇజ్రాయెల్‌ వర్సెస్ 9 అరబ్ దేశాలు.. కీలక ప్రకటన

Gaza

Gaza

Israel – Gaza War : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం జరుగుతున్న వేళ కీలక  పరిణామం చోటుచేసుకుంది.  గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ తొమ్మిది అరబ్ దేశాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. గాజా పౌరులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఆత్మరక్షణ హక్కు పేరుతో పాలస్తీనియన్ల హక్కులను విస్మరించడాన్ని తాము సమర్థించడం లేదని అరబ్ దేశాల విదేశాంగ మంత్రులు స్పష్టం చేశారు. దేశాల ఆత్మరక్షణ హక్కు అనేది  అంతర్జాతీయ చట్టం, మానవ హక్కుల చట్టాలను ఉల్లంఘించేలా ఉండకూడదని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

గాజా ప్రజలకు వార్నింగ్‌లు ఇవ్వడం, వారి ఇళ్లపై ఇజ్రాయెల్ ఆర్మీ బాంబులు, మిస్సైళ్లు వేయడాన్ని అరబ్ దేశాలు ఖండించాయి. ‘‘1967 జూన్ 4కు మునుపటి తూర్పు జెరూసలేం రాజధానిగా ఉన్న స్వతంత్ర, సార్వభౌమ పాలస్తీనా దేశం ఏర్పాటు కావాలి. ఈమేరకు రెండు దేశాల ఏర్పాటుతో చూపే పరిష్కారానికి మేం అంగీకరిస్తాం’’ అని 9 అరబ్ దేశాలు వెల్లడించాయి. ఈ ప్రకటనను విడుదల చేసిన దేశాలలో బహ్రెయిన్, ఈజిప్ట్, జోర్డాన్, కువైట్, మొరాకో, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, UAE ఉన్నాయి. కాగా, 1967 అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం ప్రాంతాలను ఇజ్రాయెల్ (Israel – Gaza War) స్వాధీనం చేసుకుంది.