Site icon HashtagU Telugu

National Girlfriend Day : జాతీయ స్నేహితురాలి దినోత్సవం..!

National Girlfriend Day

National Girlfriend Day

National Girlfriend Day : ఈరోజు జాతీయ గర్ల్ ఫ్రెండ్స్ డే జరుగుతోంది. మనందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. వారి కోసం ప్రత్యేక దినోత్సవం ఉండటానికి కారణాలు ఉంటాయి. చారిత్రక అంశాలు ఇందుకు దోహదం చేశాయి. అసలేంటి ఈ దినోత్సవం ప్రత్యేకత? ఎందుకు జరుపుకోవాలి? చరిత్ర లో ఏం జరిగింది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను చర్చించుకొని…నిజాలు చెప్పుకుందాం.

గర్ల్ ఫ్రెండ్ అనగానే ప్రేయసి (Love) అనీ.. బాయ్ ఫ్రెండ్ అనగానే ప్రియుడు (lover) అనే అర్థం వచ్చేయడం చాలా విచారకరం. దీని వల్ల మనం మన స్నేహితుల్ని ఇతరులకు పరిచయం చెయ్యాలంటే… ఇబ్బంది కరమే కానీ జాతీయ గర్ల్ ఫ్రెండ్స్ దినోత్సవం (National Girlfriend Day) ఉద్దేశం పూర్తిగా వేరు. ఇందులో ప్రేమకు చోటు లేదు. ఓన్లీ స్నేహమే. స్నేహితురాళ్ల గురించి నలుగురికీ చెప్పుకొని… వారికి శుభాకాంక్షలు చెప్పడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ప్రతి మగాడి విజయం వెనకా ఓ ఆడది ఉంటుంది అంటారు ఆలా … ఆమె ఎవరైనా కావచ్చు.

ముఖ్యంగా చాలా మందికి స్నేహితురాలు లేదా స్నేహితురాళ్లు విజయానికి కారణం అవుతుంటారు. వారు ఇచ్చే సలహాలు, సూచనల వంటివి స్నేహితుల్ని మరింత ముందుకు నడిపించగలవు. ఓ మంచి స్నేహితురాలు మీకు ఉంది అంటే… మీరు కచ్చితంగా సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలరు. ఆమె మీకు తరచూ ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. స్నేహం నుంచి క్రమంగా ప్రేమ పుట్టడం సహజమే గానీ… ఈ దినోత్సవం మాత్రం స్నేహితుల్ని స్నేహితులుగానే చూస్తూ… అదే స్నేహాన్ని చాటుతూ శుభాకాంక్షలు (Wishes) చెప్పమంటోంది.

ఈరోజు స్నేహితురాలిది. అమ్మాయిది. జనరల్ గా అబ్బాయిలకు అబ్బాయిలతో స్నేహం ఒకలా ఉంటుంది.. అమ్మాయిలతో మరోలా ఉంటుంది. అబ్బాయిలు అబ్బాయిలతో రఫ్ అండ్ టఫ్ గా వ్యవహరిస్తారు. అరేయ్, ఒరేయ్ అనుకుంటారు. ఇష్టమొచ్చిన జోక్స్ వేసుకుంటారు. హద్దులు అనేవి ఉండవు. అదే అమ్మాయితో స్నేహం దగ్గరకు వచ్చేసరికి గౌరవం, మర్యాద, బాధ్యత ఇలాంటివి చాలా ఉంటాయి. అలాంటి స్నేహాలు సమాజంలో అందరి మెప్పూ పొందుతాయి. అలాంటి ఫ్రెండ్స్ ఉన్నవారు అదృష్టవంతులే. వారు ఇవాళ తమ స్నేహితురాళ్లకు శుభాకాంక్షలు చెప్పుకోవాలి.

ఆగస్ట్ 1, 2004లో లగ్జరీ లైఫ్ స్టైల్ గురువైన సుశాన్ (Mistress Susan) ఈ జాతీయ గర్ల్‌ఫ్రెండ్స్ దినోత్సవాన్ని (National Girlfriend Day) సృష్టించారు. ఈ రోజున మహిళా స్నేహితురాళ్లు.. ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. క్రమంగా ఇది మరింత విస్తరించింది. అబ్బాయిలు కూడా మహిళా స్నేహితురాళ్లకు ఇవాళ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ గర్ల్ ఫ్రెండ్ (Girlfriend) అనే పదం.. 1863 లో వాడుకలోకి వచ్చింది. 1920 లో గర్ల్ ఫ్రెండ్ అనే పదానికి క్రమంగా అర్థం మారిపోయి… ప్రియురాలు అనే మీనింగ్ తయారైంది. సమస్య అయ్యింది.

ఈ రోజున గర్ల్ ఫ్రెండ్స్ ని ఏదైనా రెస్టారెంటుకో, సినిమాకో, స్పా కో, షాపింగ్ కో… ఎక్కడికైనా తీసుకెళ్లి.. వారి పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకోవాలట. ఇలా తీసుకెళ్లేవారు అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. తీసుకెళ్లేది ఎవరన్నది మ్యాటర్ కాదు ఇక్కడ .. స్నేహాన్ని ఎలా చాటుకున్నారన్నదే ముఖ్యం. ఇన్నాళ్లూ స్నేహం ద్వారా తోడుగా ఉంటూ… ఎన్నో కష్టాల్లో వెన్ను దన్నుగా నిలిచే స్నేహితురాళ్లకు ఇవాళ చిన్న సర్‌ఫ్రైజ్ చెయ్యొచ్చు. ఏదైనా గిఫ్ట్ ఇవ్వొచ్చు. ఆమె పేరుతో ఎవరైనా పేదవాళ్లకు సాయం చెయ్యొచ్చు. ఇలా ఏది చేసినా ఆమెకు సంతోషం కలిగించేది చెయ్యాలంటున్నారు స్నేహితులు

Also Read:  Healthy Lungs: మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆసనాలు వేయాల్సిందే..!