Land Scam: భూ దందాలు మనుగడకు ప్రమాదం! శాస్త్రవేత్తల హెచ్చరిక..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భూ దందాలు పెరిగాయి. వాటిని అక్రమిస్తూ లక్షల కోట్లు వెనకేసుకుంటున్నారు. ఈ పరిణామం మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని

  • Written By:
  • Updated On - March 6, 2023 / 11:08 AM IST

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భూ దందాలు (Land Scam) పెరిగాయి. వాటిని అక్రమిస్తూ లక్షల కోట్లు వెనకేసుకుంటున్నారు. ఈ పరిణామం మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని శాస్త్ర వేత్తలు హెచ్చరిస్తున్నారు. భూమిని కూడా కాపాడు కుంటూ ఉంటేనే మానవునికి మనుగడ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిని ఎలా సంరక్షించు కోవాలో తెలుకునే ముందు, దాని వల్ల కలిగే ఉప యోగాలు, లాభాల గురించి తెల్సుకోవాలి. భూమి అంటే మట్టే కాదని, భూమిలో గాలి, నీరు, బంకమన్ను, ఇసుక, పశువుల మరియు మోక్కల ద్వారా కుళ్ళిన శేంద్రియ పధా ర్ధాలు, ఖనిజ లవణాలు, కంటికి కనిపించని ఎన్నో లక్షలాది సూక్ష్మ క్రిములు, బాక్టీరియాలు, శిలీంద్రాలు, కీటకాలు ఉంటాయి . ఇవన్నీ కలిస్తేనే భూమి (Land) అవుతుంది. భూమి అనేది ఒక సజీవ పధార్ధ మని, ఈ పధార్ధమే ప్రాణకోటికి జీవనాధారం అని, అలాంటి భూమి ఈ మద్య కాలంలో శరవేగంగా చెడి పోతున్నదని అవేదన చెందు తున్నారు శాస్త్రవేత్తలు.

గత 6, 7 దశాబ్ధాలుగా భూమి పాడవడం మొదలైనదని , అంతక ముందు మంచిగా, ఆరోగ్యంగా ఉన్న భూమి ఎందుకు చెడిపోవడం ప్రారంభమైనదో ప్రభుత్వాలు, రైతులు, ప్రజలు ఆలోచించ వలసిన సమయం వచ్చేసిం దని, అసలు మూల కారణం జనాభా పెరుగుదల అని చెబు తున్నారు. ఏడు వందల కోట్ల మందికి ఆహారం అందించడం అంటే సాధారణ విషయం కాదని, జనాభా పెరుగుదలకు అను గుణంగా, తినే ఆహారం కోసం పంటలను ఎక్కువ పండించ వల్సి వస్తోందని, అందుకు అధిక దిగుబడులు సాధిస్తేనే అందరికి ఆహారం అందుతుం దని, అందుకోసం దిగుబడి ఎక్కువ సాధించడం కోసం రసాయనిక ఎరువుల వాడకం తప్పనిసరి అయ్యిందని, దాని వల్ల భూమి (Land) మొదటగా కొద్ది కొద్దిగా పాడవడం మొదలైన దని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సంవత్సరానికి రెండు, మూడు పంటలు పండించి, అధిక దిగుబడులు పొందడంవల్ల భూమిలో ఉన్న పోషకాలు, జీవం మొత్తం లాగేస్తున్నా మని తెలియజేస్తున్నారు. నగ రీకరణ, పట్టణీకరణ వల్ల, పరి శ్రమల వల్ల వ్యర్ధాలను అన్నీ నీటిలో వదిలేయడం వల్ల, నీరు కలుషితమై, ఆ నీటినే పంట పొలాల్లో పారించడం వల్ల భూములు పాడవు తున్నాయి. పంట పొలాల్లో పోషకాలను లాగివేయడం వల్ల భూములు చౌడు బారు తున్నాయి.

ముఖ్యంగా పారిశ్రా మిక వ్యర్ధాల వల్ల భూమి దెబ్బ తింటోందని చెబుతున్నారు. అడవులను నరికి వేయడం వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతిని, భూమి మీద గాలి దుమారాలు రావడం, గాలి ద్వారా, వరదల ద్వారా భూమి కోతకు గురవుతోందని చెబుతున్నారు. పెరుగుతున్న జనాభా కోసం, అధిక ధాన్య రాశులు అవసరం మేరకు ఎక్కువ దిగుబడి అవసరం కావున, ఎక్కువ మోతాదులో రసాయన ఎరువుల వినియో గాన్ని పెంచడం వల్లను, ఒకే ఏడాది రెండు, మూడు పంటలు వేయడం వల్లనూ, పారిశ్రామిక వ్యర్ధాల వల్లనూ, ఎంతో విలువైన భూమి నాశన మవుతున్నదని, పై పొరల మట్టి పాడైపోయి, చవుడు బారి దిగుబడులు తగ్గిపోతు న్నవని చెబుతున్నారు. ఒక్క అంగుళం భూమి (Land) ఏర్పడడానికి ఐదు వందల ఏళ్ల నుండి వెయ్యి ఏళ్ల కాలం వరకూ పడుతుందట. అంత విలువైన భూమిని మానవ అభివృద్ధి కోసం, ఆహారం కోసం, నివాసాల కోసం చెడ గొట్టుకుంటున్నామని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో చెప్పాలంటే యాబ్బై ఏళ్ల క్రితం సొర, దోస , బీర, వంగలో అర కేజీలో ఉండే పోషకాలు నేడు 2 కేజీల కూరల్లో కూడా లభించడం లేదు. అందరూ ఇక్కడొక విషయం గమనించాలి, మొక్కలకు పోషకాలు భూమి నుండి మాత్రమే అందుతాయి, మాయలు – మంత్రాలతో పోషకాలు అందవు. అలాంటి భూమిలో ప్రస్తుత కాలంలో ఖనిజాలు, ఎంజైములు లోపించడం వల్ల సారం కొరవడింది. అర్ధమయ్యే భాషలో చెప్పాలంటే క్వాండిటీ పెరిగింది గాని, క్వాలిటి తగ్గింది. పూర్వ కాలంలో మన నానమ్మ, అమ్మమ్మలు గర్భవతులుగా ఉన్నప్పుడు వారు ఎటువంటి ప్రత్యేక ఆహారాలు తీసుకోలేదు. జింక్ , ఐరన్, కాల్షియం లాంటి వన్నీ భూమి నుండీ లభ్యమయ్యే ఆకు కూరలు, పళ్ళు, ధాన్యం నుండీ ఉచితంగా వారికి లభ్యమయ్యేవి. నేడు గర్భిణీలకు అన్నిటా లోపాలు ఏర్పడడంతో మాత్రలు రూపేణా డాక్టర్లు నేరుగా అందిస్తున్నారు. తినే ఆహారం లో జింక్ లోపం ఉంటే పురుషుల్లో గానీ, పిల్లల్లో గానీ సామర్ధ్యం తగ్గుతుందని, మలేరియా వల్ల ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయో ఈ జింక్ లోపం వల్ల మానవుల్లో అన్ని మరణాలు సంభవిస్తున్నాయట.

అదే విధంగా పశువులకు, భూములకు జింక్ లోపం వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడు తున్నవట. సుస్థిరమైన, ఆరోగ్యకర వ్యవసాయం కోసం మనం భూములను కాపాడు కోవాలని, మన తాత – ముత్తాతలు సారవంత భూములను మనకు అందించారని, అలాగే మనం కూడా మన పిల్లలకు, రాబోయే తరాలకు ఆరోగ్య, సారవంత భూములు అందిచ వల్సిన భాద్యత మన మీద ఉందని అందరూ గుర్తించాలి. వ్యవసాయం చేస్తూనే భూమిని సంరక్షించు కుంటూ ముందుకు సాగాలని, మానవ జాతి ఉన్నంత వరకూ వ్యవసాయం చేస్తూనే ఉండాలని , పంటలు పండిస్తూనే ఉండాలని, దానికోసం భూమిని సారవంతం చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోతోందని, 2050 నాటికి ఇప్పుడున్న ఆహారోత్పత్తి కన్నా ఇంకా డెబ్బై రెట్లు అధికంగా పండించాలని, కానీ నగరీ కరణ, పట్టణీ కరణతో, పారిశ్రీమికీకరణతో ఉన్న భూమి తరిగి పోతోందని, కొంత భూమి కోతకు గురవ్వు తోందని, రోడ్లకు, రైళ్ళకు వేల ఎకరాల భూమి (Land) కోల్పోవల్సి వస్తోందని చెబుతున్నారు. ఇది జాగ్రత్తగా గమనించ వల్సిన విషయం. ప్రతి ఏడాది భూమి పై పొర 10 – 12 వేల మిలియన్ టన్నుల మేర అంటే పై పొర ఒకటి, రెండు అంగుళాల మేర కొట్టుకు పోతున్నది. అదే అంగుళం భూమి పై పొర తయారు కావా లంటే 500 -1000 సం.లు పడుతుంది.

అందువల్ల పసి పాప లాగా భూమిని కాపాడు కోవాలి. భూమిని కాపాడు కోవ డానికి కూడా కొన్ని నియమాలు ఉన్నవట. అవసరానికి మించి దుక్కి దున్న కూడదట. భూమిని తక్కువుగా దున్నాలని, అవసరం అయితేనే దుక్కి దున్నాలని , ఆంధ్రా ప్రాంతంలో వరి పంట చేతికి వచ్చిన పిదప, భూమిని దున్న కుండానే అపరాలు చల్లు తారని, ఇది మంచి పద్ధతి అని చెబుతున్నారు. పెద్ద పెద్ద యంత్రాలను కూడా భూమి మీద అవసరమైన మేరకే తిప్పాలి. పంటల్లో వచ్చిన అవ శేషాలను జాగ్రత్తగా భూమంతా పరవాలి, అంతే గాని కాల్చి వేయకూడదు. వ్యర్ధాలను పొలమంతా జల్లితే ఎరువుగానూ ఉపయోగ పడుతుంది, భూమిని కోతకు గురికాకుండా ఆపుతుంది. ఎండా కాంలో వచ్చే గాలుల వల్ల భూమి పై పొరల్లో ఉండే సారవంతమైన మట్టి కొట్టుకు పోతుంది. వార్షాకాలంలో వర్షాల వల్ల భూమి కోతకు గురై పై పొర కొట్టుకు పోతుంది. అందువల్ల ఆయా కాలాల్లో భూమిపై ఏదో ఒకటి కప్పి ఉంచాలి. పంటలో గాని, పంట అవశేషాలతో గానీ పచ్చి రొట్టను ఎరువుగా వేసుకో వచ్చని దాని కోసం పిల్లి పెసర, జీలగ వంటివి వేయ్యాలని, అందుకు ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహకాలు అందివ్వాలని, తరువాత భూమిని కలియదున్ని పంట వేసుకుంటే భూసారం నిలబడి ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటివి సీఎంలకు పట్టదు.

Also Read:  Mutual Funds: మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారా?