Site icon HashtagU Telugu

Krishna Janmashtami 2023 : కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలను పఠిస్తే..మీ కోరికలు ఇట్టే తీరిపోతాయి

Krishna Janmashtami 2023

Krishna Janmashtami 2023

ఈసారి ప్రతి పండగ ప్రజలను గందరగోళానికి గురిచేస్తుంది. మొన్నటికి మొన్న రాఖి (Rakhi) పండగ రెండు రోజులు రావడం తో చాలామంది అయోమయానికి గురయ్యారు. కొంతమంది ఓకే రోజు జరుపుకుంటే..మరికొంతమంది మరోరోజున జరుపుకున్నారు. త్వరలో రాబోయే వినాయకచవితి (Vinayakachavithi) కూడా అలాగే ఉంది. ఇక ఇప్పుడు కృష్ణాష్టమి (Krishna Janmashtami 2023) కూడా అలాగే వచ్చింది. కృష్ణుడు పుట్టిన రోజునే కృష్ణాష్టమిగా జరుపుకుంటూ ఉంటాం. ఈ పర్వదినాన్ని ఈ సంవత్సరం రెండు రోజుల్లో జరుపుకునే విధంగా పంచాగ కర్తలు, పండితులు స్పస్టత ఇచ్చారు. భక్తుల్లో గందరగోళానికి తెర దింపుతూ, ఈనెల 6, 7 తేదీలలో నక్షత్రం ఉండటం, ప్రత్యేకత, సంప్రదాయం గురించి వివరిస్తున్నారు.

ఇక హిందువులు అత్యంత ఇష్టంగా పవిత్రంగా జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి (Krishna Janmashtami 2023) ఒకటి . దీనినే కృష్ణాష్టమి అని, జన్మాష్టమి, గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని అని రకరకాల పేర్లతో పిలుస్తారు. శ్రీకృష్ణ భగవానుడికి అంకితం చేయబడిన ఈ రోజున భక్తులందరూ అత్యంత భక్తి భావంతో కృష్ణుని పూజిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి భాద్రపద మాసంలో కృష్ణపక్షం యొక్క ఎనిమిదవ రోజున జరుపుకుంటారు. ఈసారి కృష్ణాష్టమికి చాలా విశిష్టత ఉంది. శ్రీకృష్ణ జన్మాష్టమి రెండు రోజులపాటు కొన్నిచోట్ల జరుపుకుంటారు. స్మార్త సమూహం మొదటి రోజు జరుపుకుంటే వైష్ణవ శాఖ రెండవ రోజు కృష్ణుడు జన్మదినాన్ని జరుపుకోబోతున్నారు. కృష్ణ పక్షంలోని భాద్రపద మాసంలో సెప్టెంబర్ ఆరవ తేదీన మధ్యాహ్నం ౩:37 నిమిషాలకు కృష్ణ జన్మాష్టమి ప్రారంభమవుతుంది. అది సెప్టెంబర్ 7 సాయంత్రం 4:14 నిమిషాలకు ముగుస్తుంది.

Read Also : Fancy Number : ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్ లో 9999 అనే నంబర్ కు ఎన్ని లక్షలు పెట్టారో తెలుసా..?

ఇకపోతే జన్మాష్టమి (Krishna Janmashtami Pooja) పూజ సమయంలో ఏ మంత్రాలను పఠిస్తే శ్రీష్ణుడు ప్రతి కోరిక నెరవేరుస్తాడో చూద్దాం. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున, శ్రీ కృష్ణ భగవానుడి యొక్క కొన్ని మంత్రాలను పఠించడం ద్వారా, శ్రీ కృష్ణుడు త్వరగా సంతోషిస్తాడు. అలాగే ఆశించిన ఫలితాలు ఫలిస్తాయి. అందుకే భక్తులంతా ఎంతో భక్తిశ్రద్దలతో కృష్ణుడికి పూజలు చేస్తారు. ఆలా పూజ చేస్తూ..ఈ మంత్రాలు పఠిస్తే మీ కోర్కెలు ఇట్టే తీరుతాయని పండితులు చెపుతున్నారు. మరి ఆ మంత్రాలు ఏంటో చూద్దాం.

శ్రీ కృష్ణ మూల మంత్రం కృష్ణాయ నమః: ఈ శ్రీకృష్ణుని మంత్రాన్ని పఠించడం ద్వారా సంపదను పొందుతారు. శ్రీ కృష్ణ గోవింద హరే మురారి,హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే గోవల్లభయ్ స్వాహా..

శ్రీ కృష్ణ గాయత్రీ మంత్రం.. ఓం దేవికానందనాయ విధమహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ:ప్రచోదయ..

ఈ మంత్రాలను పూజ సమయంలో పఠిస్తే మీ కోరికలు తప్పకుండ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు..

అలాగే ఈ ఏడాది కృష్ణాష్టమికి చాలా విశిష్టత ప్రత్యేకత ఉంది. ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే ప్రత్యేకమైన ఖగోళ సంయోగం కారణంగా ఈసారి కృష్ణ జన్మాష్టమి చాలా ప్రత్యేకమైనదిగా చెబుతున్నారు. శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన సమయంలో రోహిణి నక్షత్రం ఉంది. ఇప్పుడు 2023 వ సంవత్సరంలో కూడా రోహిణి నక్షత్రం కిందకి వస్తుంది. దీంతో ఈసారి శ్రీకృష్ణాష్టమి చాలా శుభప్రదమైనది గా అరుదైనది గా పరిగణించబడుతుంది. తన లీలలతో భక్తి, జ్ఞానం, యోగం, మోక్షం గురించి ప్రపంచానికి తెలియజేస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన శుభదినం అయిన శ్రీకృష్ణాష్టమి రోజున ఎవరైతే కృష్ణుని పూజిస్తారో వారికి సకల సౌభాగ్యాలు లభిస్తాయని అంటున్నారు.